ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Coconut Water: ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా..

ABN, Publish Date - Jun 15 , 2025 | 09:41 AM

చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగుతారు. అయితే, ఇలా ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Coconut Water

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా, కొబ్బరి నీళ్లు సహజమైన పానీయం కావడంతో శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, సహజ చక్కెరలు అందుతాయి. అయితే, చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగుతారు. ఇలా ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

జీవక్రియ మెరుగుపడుతుంది

ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మరిన్నీ ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలోని జీర్ణవ్యవస్థ వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుందని, ఇది శరీరంలోని ఎంజైమ్‌లను యాక్టివ్ చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

గుండె ఆరోగ్యం

కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హై బీపీ ఉన్నవారు ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని చెబుతున్నారు.

శక్తిని పెంచుతుంది

కొబ్బరి నీటిలో ఉండే సహజ చక్కెరలు, ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది జిమ్‌ చేసిన తర్వాత లేదా తీవ్రమైన పని చేసిన తర్వాత తాగడం మరింత మంచిదని సూచిస్తున్నారు.

చర్మం మెరిసిపోతుంది

తక్కువ ఖర్చుతో చర్మానికి సహజ మెరుపు కావాలా? అయితే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, సైటోకిన్లు చర్మ కణాలను మరమ్మత్తు చేసి, వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు.

ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు సహాయం

రాత్రిపూట మన శరీరం ఎన్నో ఎలక్ట్రోలైట్స్‌ను కోల్పోతుంది. ఉదయం కొబ్బరి నీరు తాగడం ద్వారా పొటాషియం, సోడియం వంటి మూలకాలు తిరిగి అందుతాయి. ఇది డీహైడ్రేషన్‌ నివారణకు మంచి పరిష్కారం.

రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా మీ శరీరం, చర్మం, జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని వయస్సు గలవారికి లేదా కిడ్నీ సమస్యలున్నవారికి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, మీరు ప్రతి రోజూ కొబ్బరినీళ్లు తాగుతుంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ప్రతిరోజూ ఓట్స్ తింటున్నారా..

హైబీపీతో ఎలాంటి కంటి సమస్యలు వస్తాయో తెలుసా

For More Health News

Updated Date - Jun 15 , 2025 | 11:49 AM