ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Brain swelling: మెదడు వాపు ఉన్నప్పుడు.. శరీరం ఈ 6 సంకేతాలను ఇస్తుంది..

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:27 PM

మెదడు నరాలలో వాపును మెదడువాపు అంటారు. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా మెదడులో వాపు లేదా మంట ఏర్పడుతుంది. అయితే, మెదడు వాపు ఉన్నప్పుడు శరీరం ఈ 6 సంకేతాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Brain swelling

Brain swelling: అలసటగా, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా లేదా జ్ఞాపకశక్తి సరిగా లేదని అనిపిస్తుందా? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇది మెదడు నరాలలో వాపుకు సంకేతం కావచ్చు. మెదడు నరాలలో వాపును మెదడువాపు అంటారు. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా మెదడులో వాపు లేదా మంట ఏర్పడుతుంది. అయితే, మెదడు వాపు ఉన్నప్పుడు శరీరం ఈ 6 సంకేతాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తరచుగా తలతిరుగుతూ ఉండటం:

నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా తడబడటం సాధారణ బలహీనత కాదు. ఇది మెదడు నరాలలో వాపుకు సంకేతం కావచ్చు.

నిరంతర అలసట, నీరసం:

ప్రతిరోజూ తగినంత నిద్రపోయిన తర్వాత కూడా ఎక్కువగా అలసిపోవడం, నీరసంగా అనిపించడం లాగా ఉంటే నిర్లక్ష్యంగా ఉండకండి. మీ మెదడులోని నరాలలో వాపు ఉండవచ్చు.


జ్ఞాపకశక్తి బలహీనత:

మీరు పదే పదే కొన్ని విషయాలను గుర్తుంచుకోలేకపోతే, జ్ఞాపకశక్తి బలహీనతగా ఉందని అనిపిస్తే మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మానసిక స్థితిలో మార్పులు, చిరాకు:

ఉన్నట్టుండి కోపం , చిరాకుగా అనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. మెదడు వాపు మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసిందని అర్థం.

తలలో బరువుగా ఉండటం:

మీకు ప్రతి రోజు ఉదయం తలలో బరువుగా అనిపిస్తే అది మైగ్రేన్ లేదా సైనస్ కావచ్చు.

మూర్ఛలు:

శరీరంలో వణుకు లేదా అకస్మాత్తుగా నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది మెదడు వాపుకు తీవ్రమైన దశ కావచ్చు.


Also Read:

మీ కిడ్నీ సరిగ్గా పనిచేస్తుందా లేదా? ప్రతిరోజూ ఇంట్లో ఇలా చెక్ చేసుకోండి..

నిలబడి నీళ్లు తాగితే కిడ్నీలపై ప్రభావం పడుతుందా..

For More Health News

Updated Date - Jun 03 , 2025 | 12:27 PM