BP: స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకునే అవకాశం ఉందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ABN, Publish Date - May 19 , 2025 | 10:54 PM
స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకోవచ్చా? కచ్చితమైన అంచనా వేయొచ్చా? అనే ప్రశ్నలకు నిపుణులు సవివరమైన సమాధానం ఇస్తున్నారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ వుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బీపీపై నిత్యం ఓ కన్నేసి ఉంచాలి. గుండె ఆరోగ్యం కాపాడుకునేందుకు ఇది ఎంతో అవసరం. అయితే, బీపీని కచ్చితంగా అంచనా వేయాలంటే వైద్య సిబ్బంది సాయం కావాలి. మరి నేటి ఆధునిక జమానాలో ఫోన్‌తో బీపీని చెక్ చేసుకునే అవకాశం ఉందా? ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండే యాప్స్‌తో బీపీ చెక్ చేసుకోవచ్చా? అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. దీనికి నిపుణులు సవివరమైన సమాధానమే ఇస్తున్నారు.
రక్తనాళాల గోడపై రక్తం వల్ల కలిగే ఒత్తిడినే బీపీ అంటారు. బీపీ తగ్గిన సందర్భాల్లో తల తిరిగినట్టు ఉండటం లాంటి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి రోగులు స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం ఉంది. అయితే, హై బీపీతో మాత్రం ఇంతకంటే ఎక్కువ సమస్యలే వస్తాయి. బీపీ పెరిగి గుండె కండరాలు దెబ్బతింటాయి. కిడ్నీలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే, క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకుంటూ ఉంటే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి నివారణ చర్యలు తీసుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ జమానాలో బీపీని కొలుస్తామని చెప్పుకునే అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కెమెరా ఫ్లాష్, ఇతర సెన్సర్ల సాయంతో ఫొటోప్లెథిస్మోగ్రఫీ లేదా పల్స్ ట్రాన్సిట్ టైం విధానంలో బీపీని కొలుస్తుంటాయి. అయితే, ఈ విధానం కచ్చితత్వం కేవలం 25 శాతం నుంచి 50 శాతం మధ్య ఉన్నట్టు అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. దీంతో, రోగులు తమ బీపీ పెరుగుతున్నా గుర్తించలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
అయితే, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ శాస్త్రవేత్తలు 2024లో బీపీని కొలిచే స్మార్ట్ ఫోన్ యాప్‌ను డిజైన్ చేశారు. ఫొన్‌లోని యాక్సెలరోమీటర్, కెమెరా, టచ్ సెన్సార్ల సమాచారం ఆధారంగా ఈ యాప్ బీపీని అంచనా వేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి, వేళ్లపై ఉండే ఒత్తిడి ఆధారంగా యాప్ బీపీని అంచనా వేస్తుంది. చేతులను వివిధ ఎత్తుల్లో ఉంచి స్మార్ట్ ఫోన్ టచ్ చేయమని చెబుతూ ఈ యాప్‌ను బీపీని కొలుస్తుంది.
గురుత్వాకరణ శక్తి కారణంగా చేతులను ఛాతి కంటే పైకి ఎత్తినప్పుడు వేళ్లల్లో హైడ్రోస్టాటిక్ ఒత్తిడి మారుతుంది. ఫోన్‌లోని యాక్సెలరోమీటర్ ద్వారా ఈ మార్పులను గుర్తించొచ్చు. తద్వారా బీపీని అంచనా వేయొచ్చు’’ అని సదరు యూనివర్సిటీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనం తాలూకు వివరాలు ప్రచురితమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
40ల్లో ఉన్న మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది
చర్మంలో ఈ మార్పులు కనిపిస్తే ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్టే..
కొందరు 4 గంటల నిద్రతో సరిపెట్టుకోగలరు.. ఇలా ఎందుకో గుర్తించిన శాస్త్రవేత్తలు
Updated Date - May 19 , 2025 | 11:04 PM