Omega-3-Fatty acids Deficiency: చర్మంలో ఈ మార్పులు కనిపిస్తే ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్టే..
ABN , Publish Date - May 15 , 2025 | 03:42 PM
ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపించిన పక్షంలో చర్మంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: చర్మం ఆరోగ్యానికి ఒమెగా -3-ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో కీలకం. ఇవో రకరమైన పాలీ అన్‌శాచ్చురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ అని నిపుణులు చెబుతున్నారు. గుండె, మెదడు, రోగ నిరోధక శక్తి మెరుగ్గా పనిచేయడానికి ఒమెగా -3- ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో అవసరం. ఇవి లోపించినప్పుడు అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
డెర్మటాలజిస్టులు చెప్పే దాని ప్రకారం, ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ చర్మంపై ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాయి. దీంతో, చర్మంపై తేమ నిలిచి ఉండటమే కాకుండా అలర్జీ కారకాల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. వీటిలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం కూడా ఉంటుంది. కాబట్టి, ఎగ్జీమా, సోరియాసిస్, మొటిమలతో బాధపడేవారికి ఈ ఫ్యాటీ యాసిడ్స్ అత్యంత ఆవశ్యకం.
ఇక ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపించిన సందర్భాల్లో పలు చర్మ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. చర్మం పొడిగా మారడం, పొట్టు రేగడం, దురదలు, సున్నితంగా మారడం, కమిలిపోయినట్టు ఉండటం వంటివన్నీ ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపాన్ని సూచిస్తాయి.
మొటిమలు నిత్యం వేధించడం, చిన్న వయసులోనే చర్మం ముడతలు పడటం, కాంతిహీనంగా మారడం వంటివన్నీ ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల తలెత్తుతాయి.
గాయాలు నెమ్మదిగా మానుతున్నా, చికిత్సల తరువాత కూడా మొటిమలు వేధిస్తున్నా ఈ ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్టు భావించాలి.
ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్‌ను శరీరం తనంతట తానుగా తయారు చేసుకోలేదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఇవి ఆహారం ద్వారా శరీరానికి తగినమొత్తంలో అందాలి. చేపలు, వాల్‌నట్స్ వంటి వాటిల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇక డాక్టర్ల సూచన మేరకు సప్లిమెంట్స్ ద్వారా కూడా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. అయితే, డాక్టర్ల పర్యవేక్షణ సూచనల మేరకే సప్లిమెంట్స్ తీసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.
చర్మానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే సమస్య మూలాలు తెలిసి త్వరగా పరిష్కారం లభిస్తుందన్న విషయం మర్చిపోకూడదు.
ఇవి కూడా చదవండి:
కొందరు 4 గంటల నిద్రతో సరిపెట్టుకోగలరు.. ఇలా ఎందుకో గుర్తించిన శాస్త్రవేత్తలు
ఈ సింపుల్ టెక్నిక్‌తో నీళ్లల్లోని మైక్రో ప్లాస్టిక్స్‌ను సులువుగా తొలగించుకోవచ్చు
ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?