ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High BP - Eye Health: హైబీపీతో కంటి సమస్యలు.. వైద్యుల సలహా ఏంటంటే..

ABN, Publish Date - Jun 14 , 2025 | 05:12 PM

హైబీపీతో కూడా పలు కంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

high blood pressure eye damage

ఇంటర్నెట్ డెస్క్: హైబీపీ అంటే సాధారణంగా అందరికీ గుండె పోటు, స్ట్రోక్ వంటివి గుర్తొస్తాయి. అయితే, బీపీతో కంటి చూపు కూడా దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. కొందరికి హైబీపీ కారణంగా చూపు మందగిస్తే మరి కొందరికి కంటి స్ట్రోక్ వస్తుందని చెబుతున్నారు. చాలా సందర్భాల్లో కంటి సమస్యలు అంత త్వరగా బయటపడవని, ఫలితంగా చూపును శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి వైద్యులు చెప్పే దాని ప్రకారం, బీపీతో వచ్చే కంటి సమస్యలు ఏవంటే..

హైబీపీ కారణంగా కంట్లోని రెటీనాలోగల సున్నితమైన రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హైపర్‌టెన్సివ్ రెటినోపతీకి దారి తీస్తుంది. దీని వల్ల చూపు మసకబారడంతో పాటు కంటిముందు ఏవో నల్లని మచ్చలు, కాంతిపుంజాలు మెదులుతున్న భావన కలుగుతుంది. గుర్తించలేనంత నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ సమస్యను కంటి చెకప్‌ ద్వారానే గుర్తించేందుకు వీలవుతుంది.

రెటీనాలోని రక్తనాళాలపై నిత్యం అధిక ఒత్తిడి ఉంటే రక్తసరఫరా నిలిచిపోయే ముప్పు ఏర్పడుతుంది. చివరకు అకస్మాత్తుగా చూపు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని ఐ స్ట్రోక్ అని అంటారు. ఇలాంటప్పుడు నొప్పి ఉండకపోయినా కూడా సత్వరం చికిత్స అందకపోతే రోగులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

హైబీపీ.. సబ్‌కంజెక్టివల్ హెమొరేజ్‌‌కు దారి తీయొచ్చు. ఈ సమస్య తలెత్తినప్పుడు కంటిలోని తెల్లని భాగంలో రక్తస్రావం జరిగి ఎర్రని మచ్చలు ఏర్పడతాయి. వీటితో ఎలాంటి అపాయం లేకపోయినప్పటికీ రెటీనాలో రక్తస్రావం అయితే మాత్రం కంటి చూపు బాగా దెబ్బతింటుంది. పరిస్థితి విషమిస్తోందనేందుకు ఇదో సంకేతం.

హైబీపీ కారణంగా ఆప్టిక్ నాడికి రక్త సరఫరా నిలిచిపోతే ఇషెమిక్ ఆప్టిక్ న్యూరోపతి అంటారు. దీంతో, శాశ్వతంగా చూపు కోల్పోతారు. అకస్మాత్తుగా తలెత్తే ఈ సమస్య నుంచి కోలుకోవడం అసాధ్యం.

హైబీపీతో ఇంట్రాఆక్యులార్ ప్రెషర్ కూడా పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇది గ్లకోమాకు దారి తీయొచ్చు. గ్లకోమా బారిన పడ్డ వారికి పెరిఫెరల్ విజన్ తగ్గుతుంది. తొలి దశలో గ్లకోమా రోగుల్లో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తరచూ కంటి చెకప్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బీపీని నియంత్రణలో పెట్టుకోవాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకునే అవకాశం ఉందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

రాత్రి డిన్నర్ ఎన్ని గంటలకు చేయాలో తెలుసా

Read Latest and Health News

Updated Date - Jun 14 , 2025 | 05:19 PM