Heart: గుండె ఆరోగ్యాన్ని కాపాడే 7 ఆయుర్వేద చిట్కాలు..
ABN, Publish Date - Jun 01 , 2025 | 01:59 PM
ఆయుర్వేదంలో మన ఆరోగ్యాన్ని సహజంగా కాపాడే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ధమనులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 7 ఆయుర్వేద చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Heart Ayurvedic Tips: గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ఒక ముఖ్యమైన అవయవం. గుండె రక్తాన్ని పంప్ చేస్తూ ఆక్సిజన్, పోషకాలను కణజాలాలకు తీసుకువెళుతుంది. అయితే, మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన ధమనులు శుభ్రంగా, రక్త ప్రసరణ సజావుగా జరిగేలా ఉండాలి. ఆయుర్వేదంలో మన ఆరోగ్యాన్ని సహజంగా కాపాడే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ధమనులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 7 ఆయుర్వేద చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయుర్వేద మూలికలు
అశ్వగంధ, బ్రాహ్మి, జతమాంసి వంటి ఆయుర్వేద మూలికలు శరీరాన్ని శాంతంగా ఉంచుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడమే కాక, రక్తపోటును సమతుల్యంలో ఉంచుతాయి.
ఆముదం
శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లాలంటే ప్రేగు కదలికలు సరిగా ఉండాలి. ఆయుర్వేదంలో దీనికోసం విరేచన విధానం ఉంది. ప్రతిరోజూ కొన్ని పచ్చి బొప్పాయి గింజలు లేదా వారానికి ఒకసారి కొద్దిగా ఆముదం తాగితే శుభ్రత కలుగుతుంది.
వ్యాయామం
వ్యాయామం చేయడం వల్ల గుండె బలంగా పనిచేస్తుంది. ఇలా చేస్తే ధమనుల్లో కొవ్వు పేరుకుపోదు. కార్డియో, స్ట్రెచింగ్, బ్రీతింగ్ యాక్టివిటీస్ వంటి వాటిని చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.
జీర్ణశక్తిని బట్టి తినాలి
మీ జీర్ణశక్తి బలంగా ఉన్నపుడు, మీరు తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. తద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోదు. అయితే, కేలరీలు ఎక్కువుగా ఉన్న ఆహారం తీసుకుంటే అవి విషపదార్థాలుగా మారి ధమనుల్లో పేరుకుపోతాయి. అందుకే, మీ జీర్ణశక్తిని గుర్తుంచుకుని ఆహారం తీసుకోండి.
చక్కెర స్థాయిని నియంత్రించండి
రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే అది ధమనులకు నష్టాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి, బంగాళదుంపలు కూడా రక్త చక్కెరను వేగంగా పెంచుతాయి. అందుకే, కార్బోహైడ్రేట్లు ఎంత తీసుకోవాలి అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఒత్తిడిని తగ్గించండి
శరీరంపై ఒత్తిడి ఎక్కువగా ఉంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీన్ని నివారించేందుకు బ్రాహ్మి, జతమాంసి, శంఖపుష్పి వంటి ఆయుర్వేద మూలికలు సహాయపడతాయి. యోగా, ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మంచి దినచర్య
రోజూ ఒకే సమయానికి లేవడం, తినడం, నిద్రపోవడం వంటివి శరీరానికి శ్రేయస్కరంగా ఉంటాయి. ఈ విధంగా ఆరోగ్యకరమైన దినచర్య పాటిస్తే ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి.
Also Read:
పాక్ గురించి నిజం చెప్పడం తప్పా? ఆమెను వదిలేయండి.. డచ్ ఎంపీ..
అందరూ పాక్ వెంటే ఉన్నారు.. ఎందుకిలా.. కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ ప్రశ్న
For More Lifestyle News
Updated Date - Jun 01 , 2025 | 02:00 PM