Weight Loss: బరువు తగ్గాలంటే కేవలం డైట్ సరిపోదు.. ఈ అలవాట్లు మానుకోండి..
ABN, Publish Date - Jun 19 , 2025 | 03:43 PM
బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే సరిపోదు. ఈ అలవాట్లను కూడా మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Weight Loss: చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. అయితే, బరువు తగ్గాలంటే కేవలం డైట్ చేస్తే సరిపోదు.. కొన్ని చెడు అలవాట్లను కూడా మార్చుకోవాలి. బరువు తగ్గడానికి చెడు అలవాట్లను మానేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా జంక్ ఫుడ్, చక్కెర పానీయాలు, వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించాలి. అలాగే, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, తగినంత నిద్ర లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి.
ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తినడం
చిప్స్, బర్గర్లు, పిజ్జాలు, ప్యాకెట్ స్నాక్స్ ..ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి కావు. ఎందుకంటే, వీటిలో ఎక్కువ చక్కెర, నూనె, తక్కువ పోషకాలు ఉంటాయి. బరువు పెరగడమే కాకుండా, మధుమేహం, గుండె రోగాలకు దారి తీస్తాయి. కాబట్టి, ఇంటి భోజనం తినండి. తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి.
తగినంత నీరు తాగకపోవడం
నీరు తక్కువగా తాగితే జీవక్రియ మందగిస్తుంది. దీని కారణంగా శరీరం ఎక్కువ కాలరీలను ఖర్చు చేయకపోవచ్చు. అలాగే.. ఆకలి, దాహం మధ్య తేడా తెలియక ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. నీరు శరీరం నుంచి విషాలను తొలగించడంలో ముఖ్యమైనది కాబట్టి రోజుకు కనీసం 2 – 3 లీటర్ల నీరు తాగండి. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చటి నీరు తాగడం మంచిది.
ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం
ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే త్వరగా ఆకలి వేస్తుంది. అంతేకాకుండా, మలబద్ధకం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది బరువు పెరగడానికి కారణం కావచ్చు. కాబట్టి, పండ్లు (ఆపిల్, నారింజ), ఓట్స్, చియా గింజలు, పప్పులు తినండి.
తగినంత నిద్ర లేకపోవడం
నిద్ర, బరువు తగ్గడం మధ్య బలమైన సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరగడం, బరువు తగ్గడం కష్టం అవుతుంది. నిద్రలేమి వల్ల హార్మోన్ల అసమతుల్యత, ఆకలి పెరగడం, జీవక్రియ మందగించడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. కాబట్టి, ప్రతిరోజూ 7–8 గంటల నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
రక్తహీనత లేకపోయినా బలహీనంగా ఉన్నారా? అయితే.. అది ఇదే కావచ్చు..
ముఖంలో కనిపించే ఈ చిన్న మార్పే... నోటి క్యాన్సర్‌కు సంకేతమా?
For More Health News
Updated Date - Jun 19 , 2025 | 03:48 PM