Ayurvedic tips: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా.. ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..
ABN, Publish Date - Jun 21 , 2025 | 01:19 PM
మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? అయితే, ఉపశమనం పొందడానికి ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Migraine Ayurvedic Tips: మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పి కలిగించే ఒక సాధారణ సమస్య. ఇది మెదడులోని నరాలు, రక్తనాళాలలో కలిగే మార్పుల వల్ల వస్తుంది. సాధారణంగా, తలలోని ఒక ప్రాంతంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, వికారంగా అనిపించడం, వాంతులు రావడం, చిరాకు, అలసటగా అనిపించడం వంటివి మైగ్రేన్ లక్షణాలు.
మైగ్రేన్ వివిధ కారణాల వల్ల రావచ్చు. జన్యుపరమైన కారణాలు, పర్యావరణ కారకాలు, హార్మోన్ల మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటివి మైగ్రేన్‌కు కారణం అవుతాయి. మీకు మైగ్రేన్ లక్షణాలు ఉంటే చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. అయితే, మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడానికి ఇంటి నివారణలతో పాటు ఆయుర్వేద చిట్కాలు కూడా ట్రై చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటి నివారణలు
అల్లం, నిమ్మరసం సమాన పరిమాణంలో కలిపి రోజూ తాగడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
చల్లటి నీటితో స్నానం చేయండి. ఇది తల వేడిని తగ్గిస్తుంది.
నువ్వులు, కర్పూరం నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
ఉదయం ఖాళీ కడుపుతో రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క నీరు తీసుకోండి.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గడం మాత్రమే కాకుండా తలనొప్పి కూడా తగ్గుతుంది.
ఆయుర్వేద చొట్కాలు
ఆయుర్వేదంలో మైగ్రేన్‌ను అర్ధభేదక్ లేదా అర్ధశిషి అని పిలుస్తారు. తలలో ఒక వైపున విపరీతమైన తలనొప్పి కలుగుతుంది.
ప్రతి రోజు ఉదయం, రెండు ముక్కు రంధ్రాలలో రెండు చుక్కల అను నూనె లేదా శతావరి నెయ్యి వేసుకోవడం మంచిది. ఇది మెదడు, నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది.
నువ్వుల నూనె, బ్రాహ్మి నూనె లేదా పాలు తలపై పోసుకోవడం మంచిది. ఇది మానసిక విశ్రాంతిని ఇస్తుంది. అలాగే తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
మీకు డయాబెటిస్ ఉందా.. కంట్రోల్ చేయాలంటే ఈ ఆసనాలు ట్రై చేయండి..
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నిజంగా ఫలితమిస్తుందా? కొత్త రీసెర్చ్ ఏం చెబుతోందంటే..
For More Health News
Updated Date - Jun 21 , 2025 | 04:40 PM