ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Excessive Gas: అపాన వాయువుకు వేగంగా చెక్ పెట్టే పరిష్కారాలు

ABN, Publish Date - Jun 14 , 2025 | 05:55 PM

అపాన వాయువుతో ఇబ్బంది పడేవారికి కొన్ని చక్కని పరిష్కారాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Excessive Gas Remedies

ఇంటర్నెట్ డెస్క్: జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉందనేందుకు అపాన వాయువు ఓ ముఖ్య సంకేతమని వైద్యులు చెబుతారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ఇబ్బందికర పరిస్థితులకు దారి తీయొచ్చు. ఇక ఈ సమస్యతో నిత్యం ఇబ్బంది పడే వారి ముందు కొన్ని చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటితో తక్షణ పరిష్కారం లభిస్తుందని భరోసా ఇస్తున్నారు.

వైద్యులు చెప్పేదాని ప్రకారం, సిమెథికోన్ ఔషధంతో ఈ సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. దీన్ని మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొనుగోలు చేయొచ్చు. ఇది కడుపులోని అపానవాయువు బబుల్స్‌పై సర్ఫేస్ టెన్షన్‌ను తగ్గిస్తుంది. దీంతో, ఈ గ్యాస్ బుడగలు కలిసిపోయి సులువుగా బయటకుపోతాయి. విమానప్రయాణాలు చేసే వారు వీటిని తప్పక వెంట తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. కడుపుబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.

పుదీనా టీతో కూడా అపాన వాయువు బెడదకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. పుదీనాలోని మెంథాల్‌ పేగుల కండరాలు వదులుగా అయ్యేలా చేస్తుంది. దీంతో, కడుపు ఉబ్బరం తగ్గి గ్యాస్ త్వరగా బయటకు పోతుంది. కడుపులోని ఇబ్బందులు కూడా పుదీనాతో తొలగిపోతాయి.

పెప్టోబిస్మాల్ మరో అద్భుత ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. ఇది పేగుల్లోని దుర్గంధకారక సల్ఫర్‌ను పట్టి బంధిస్తుంది. దీంతో, అపాన వాయువులోని దుర్వాసన తగ్గుతుంది. ఈ ఔషధంలో బిస్‌మత్ సబ్‌శాలిసిలేట్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది పేగుల్లోని సల్ఫర్ ఆధారిత పధార్థాలను పట్టి బంధించి అపానవాయువు దుర్వాసన తగ్గేలా చేస్తుంది. ఇది లిక్విడ్, టాబ్లెట్‌ల రూపంలో లభిస్తుంది.

వీటితో పాటు కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో అపాన వాయువు బెడద నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. గ్యాస్‌కు కారణమయ్యే కొన్ని రకాల కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ చక్కెర పదార్థాలు, పీచు పదార్థాలను తినకూడదు. చ్యూయింగ్ గమ్ అలవాటుంటే మానుకోవాలి. సోడా, బీర్ లాంటి కార్బొనేటెడ్ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు. ధూమపానం అలవాటునూ వదిలిపెట్టాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అపాన వాయువు బెడద వేధిస్తోందంటే వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి:

హైబీపీతో కంటి సమస్యలు.. వైద్యుల సలహా ఏంటంటే..

రాత్రి డిన్నర్ ఎన్ని గంటలకు చేయాలో తెలుసా

Read Latest and Health News

Updated Date - Jun 14 , 2025 | 06:03 PM