ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Muskmelon: కర్బూజ పండు తిన్న తర్వాత వీటిని తినకండి.. ఆరోగ్యానికి హానికరం..

ABN, Publish Date - May 16 , 2025 | 03:57 PM

మీరు కర్బూజ పండును ఎక్కువగా తినడానికి ఇష్టపడితారా? అయితే, వాటిని తిన్న తర్వాత పొరపాటున కూడా మీరు ఈ ఆహార పదార్ధాలను తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Muskmelon

Muskmelon: కర్బూజ ఒక రుచికరమైన పండు. దీంట్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంది. దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. కర్బూజ పండులో విటమిన్ A, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే, కర్బూజ పండు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

పెరుగు

పొరపాటున కూడా కర్బూజ పండు తిన్న తర్వాత పెరుగు తినకండి. కర్బూజ పండులో ఉండే నీటి శాతం కడుపులో ఆమ్లాన్ని సృష్టిస్తుంది. పెరుగు తినడం వల్ల ఈ ప్రక్రియ ఆగిపోతుంది. దీనివల్ల అజీర్ణ సమస్య మొదలవుతుంది.


సోడా లేదా శీతల పానీయం

కర్బూజ పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ లేదా సోడా డ్రింక్ తాగకూడదు. ఈ రెండూ కలిసి కడుపులో వాయువును ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. ఏదైనా పండు తిన్న తర్వాత గంట వరకు పొరపాటున కూడా మీరు శీతల పానీయాలు లేదా సోడా పానీయాలు తాగకూడదని గుర్తుంచుకోండి.

కారంగా, వేయించిన ఆహారాలు

కర్బూజ పండు తిన్న వెంటనే కారంగా, ఘాటుగా, ఉప్పగా లేదా వేయించిన ఆహారాన్ని తినకూడదు. ఎందుకంటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. తరచుగా కడుపు నొప్పితో బాధపడేవారు పొరపాటున కూడా ఈ కాంబినేషన్ తినకూడదు.

మద్యం

కర్బూజ పండు తినే ముందు లేదా తర్వాత పొరపాటున కూడా మద్యం తాగకూడదు. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ జీర్ణ సమస్యలు వస్తాయి.


Also Read:

Viral News: గుండెలు పిండేసే స్టోరీ.. తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో..

Vastu Tips For Door: ఇంట్లో ఇలాంటి తలుపు ఉంటే దరిద్రం.. లక్ష్మీదేవి అస్సలు ఉండదు.

Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో రూ.50వేల కోట్లు..

Updated Date - May 16 , 2025 | 04:13 PM