ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Psoriasis and Nutrition: ఈ తరహా ఫుడ్ తింటే సోరియాసిస్‌కు చెక్!

ABN, Publish Date - Mar 09 , 2025 | 03:48 PM

సోరియాసిస్‌తో బాధపడుతున్నారా? ఇలాంటి ఆహారం తీసుకుంటే వేగంగా ఉపశమనం. మరి ఈ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: సోరియాసిస్ అంటే చాలా మంది చర్మ సంబంధిత సమస్యగానే భావిస్తారు. అయితే, ఇదో ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే.. మనల్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించాల్సిన రోగ నిరోధక వ్యవస్థ మన శరీరాన్ని టార్గెట్ చేసుకోవడం. ఇక సోరియాసిస్ సమస్య నుంచి ఉపశమనం కోసం రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ రాసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ పాటించే చాలా మంది ఆహారంపై మాత్రం దృష్టిపెట్టట్లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే ఆహారంతో సోరియాసిస్ సమస్య తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు (Psoriasis and Nutrition).


Calories burned in Cricket: వామ్మో.. క్రికెట్ ఆడితే ఇన్ని కెలరీలు ఖర్చవుతాయా

సోరియాసిస్‌తో బాధపడే వారిలో రోగ నిరోధక వ్యవస్థ ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది. దీంతో, దురదలు మొదలు, చర్మం కందిపోవడం వంటి రకరకాల సమస్యలు మొదలవుతాయి. అయితే, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తింటే కూడా ఇన్‌ఫ్లమేషన్ పెరిగి పరిస్థితి మరింత తీవ్రమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొవ్వులు అధికంగా ఉన్న ఫుడ్ కారణంగా పేగుల్లో హితకకర బ్యాక్టీరియా తగ్గిపోతుంది. ఇది మరింతగా ఇన్‌ఫ్లమేషన్ పెరిగేలా చేస్తుంది.

కాబట్టి, సోరియాసిస్‌ను నియంత్రించేందుకు ముందుగా కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఓమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ వంటివన్నీ పేగుల్లో హితకర బ్యా్క్టీరియాను వృద్ధి చేసి ఇన్‌ఫ్లమేషన్‌ను అదుపులో ఉంచుతాయి. ఫలితంగా, సోరియాసిస్ అవస్థల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి, సంతప్త కొవ్వులు ఏయే ఆహారాల్లో ఉన్నాయో చూసుకుని జాగ్రత్తగా తింటే సోరియాసిస్ సమస్యలు తగ్గుతాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు.


Prevent Night Sugar Drop: రాత్రిళ్లు షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్

కాబట్టి, ఈ వ్యాధి ఉన్న వారు కేవలం ఆయింట్‌మెంట్లు, ఇతర ఔషధాలపైనే ఆధారపడకుండా సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినకుండా ఉంటే మరింత ఫలితం లభిస్తుంది. సోరియాసిస్‌ను మూలాల నుంచి కట్టడి చేసేందుకు ఇంతకు మించిన వ్యూహం లేదనేది వైద్యులు చెప్పేమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ట్రిక్ ఫాలో అయ్యి సమస్యల నుంచి సత్వర ఉపశమనం పొందండి!

ఈ బ్లడ్ గ్రూప్స్ వారికి గుండె జబ్బులు, ఉదర సంబంధిత సమస్యల అవకాశాలు ఎక్కువ!

Read Latest and Health News

Updated Date - Mar 09 , 2025 | 03:48 PM