ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health CheckUp For Men: 40 ఏళ్లు దాటిన పురుషులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే

ABN, Publish Date - May 20 , 2025 | 10:42 PM

40 ఏళ్లు దాటిన పురుషులు క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

Men’s Health

ఇంటర్నెట్ డెస్క్: భారతీయుల్లో చాలా మంది క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోరు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలు, పురుషులకు హెల్త్ చెకప్‌లు తప్పనిసరి. గుండె జబ్బులు, డయాబెటిస్, ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ఇక వయసు పైబడుతున్న పురుషులు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

పురుషుల్లో మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బు అని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఏటా 33 వేల నుంచి 42 వేల మంది పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్‌ను గుర్తించేందుకు పీఎస్ఏ టెస్టు తరచూ చేయించుకుంటూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో, ప్రొస్టేట్ గ్రంధీలో ఇన్‌ఫ్లమేషన్, వాపు వంటి వాటిని ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది.


డయాబెటిస్ రిస్క్ తగ్గించుకునేందుకు లిపిడ్ ప్రొఫైల్, షుగర్ టెస్టులు తప్పనిసరి. ఎల్‌డీఎల్‌, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను బట్టి ఒంట్లో కొవ్వు ఎంత ఉందో అంచనా వేస్తారు. హెచ్‌బీఏ1సీతో షుగర్ లెవెల్స్‌పై అవగాహన వస్తుంది.

కిడ్నీ, లివర్ ఫంక్షన్ టెస్టులు కూడా చేయించుకుంటూ ఉంటే ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచొచ్చు. మద్యపానం, డయాబెటిస్ ఉన్న వారికి ఈ పరీక్షలు తప్పనిసరి.

కొలాన్, అబ్డామినల్ స్క్రీనింగ్స్‌తో ఉదర సంబంధిత సమస్యలు, కీలక అవయవాలకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. 50 ఏళ్లు పైబడిన పురుషులు తప్పనిసరిగా కొలొనోస్కోపీ చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

బోన్ డెన్సిటీ టెస్టులను క్రమం తప్పకుండా చేయించుకుంటే ఓస్టియోపోరోసిస్ వ్యాధి రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. మహిళలు ఈ పరీక్ష చేయించుకోవడం మరీ ముఖ్యం. ఈసీజీ పరీక్షలతో గుండె జబ్బు ముప్పు తగ్గించుకోవచ్చు.


టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ పరీక్షలు చేయించుకుంటే వయసుతో పాటు వచ్చే హార్మోన్‌లపై ఓ కన్నేసి ఉంచొచ్చు.

జన్యుపరమైన పరీక్షల ద్వారా ప్రాస్ట్రేట్, బ్రెస్ట్, ఓవేరియన్ క్యాన్సర్ ముప్పు ఎంత ఉందో తెలుసుకుని ముందు జాగ్రత్త చర్యలు పాటించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకునే అవకాశం ఉందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

40ల్లో ఉన్న మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది

చర్మంలో ఈ మార్పులు కనిపిస్తే ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్టే..

Read Latest and Health News

Updated Date - May 20 , 2025 | 10:44 PM