ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Inter annual exams: ఇంటర్ పరీక్షలపై బిగ్ అప్‏డేట్.. కేంద్రాల వద్ద అవి ఫ్రీ..

ABN, Publish Date - Mar 04 , 2025 | 10:09 AM

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు వేళయింది. రేపటి నుంచి మార్చి 25 వరకు జరిగే పరీక్షలు రాసేందుకు గ్రేటర్‌లో జిల్లాల వారీగా విద్యాధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయంతోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.

- ఏర్పాట్లు పూర్తిచేసిన విద్యాధికారులు

- గ్రేటర్‌లో పరీక్షకు హాజరుకానున్న 4,64,445 మంది విద్యార్థులు

హైదరాబాద్‌ సిటీ: ఇంటర్‌ వార్షిక పరీక్షలకు వేళయింది. రేపటి నుంచి మార్చి 25 వరకు జరిగే పరీక్షలు రాసేందుకు గ్రేటర్‌లో జిల్లాల వారీగా విద్యాధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయంతోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వర సేవలందించేందుకు వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లను కూడా నియమించారు. పరీక్షా సమయంలో నిరంతరాయంగా కరెంట్‌ సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అరెస్ట్‌ పేరుతో రూ.1.50 లక్షలు లూటీ చేసేశారు..


గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో 4,64,445 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షల నేపథ్యంలో ఒక్కో గదిలో 25 మంది చొప్పున కూర్చునే విధంగా సీటింగ్‌ కేటాయించారు. అలాగే పరీక్ష పత్రాలు బయటకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రిన్సిపాల్‌ గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో సిట్టింగ్‌ స్క్వాడ్‌లు 10, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 4 బృందాలను నియమించారు. అలాగే రంగా రెడ్డి జిల్లాలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ 5, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 4, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 5 సిట్టింగ్‌, 6 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను పెట్టారు.


వీరితోపాటు డిస్ర్టిక్ట్‌ ఎగ్జామినేషన్‌ కమిటీ (డీఈసీ)కి చెందిన ఐదుగురు సభ్యులు, ఇద్దరు హైపవర్‌ కమిటీ సభ్యులను నియమించారు. అలాగే కేంద్రాల సంఖ్యకు సమానంగా చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు. కేంద్రాల అడ్ర్‌సను ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలని, సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ ద్వారా చిరునామా ఈజీగా తెలుసుకోవచ్చని తెలిపారు. హాల్‌టికెట్లను tgbie.cgg.gov.in లాగిన్‌ అయి పొందాలన్నారు.


ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు

ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2025 | 10:39 AM