NDA NA Recruitment: స్వాగతిస్తున్న సైన్యం
ABN, Publish Date - Dec 15 , 2025 | 02:50 AM
సాహసికులకు సైన్యం స్వాగతం పలుకుతోంది. ఈ క్రమంలో త్రివిధ దళాల్లోని అధికారిక హోదాలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ అలాగే సీడీఎస్ నోటిఫికేషన్లను యూపీఎస్సీ విడుదల చేసింది......
ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ, సీడీఎస్ నోటిఫికేషన్స్
సాహసికులకు సైన్యం స్వాగతం పలుకుతోంది. ఈ క్రమంలో త్రివిధ దళాల్లోని అధికారిక హోదాలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ అలాగే సీడీఎస్ నోటిఫికేషన్లను యూపీఎస్సీ విడుదల చేసింది.
ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ
ఈ పరీక్షతో 394 ఖాళీలను యూపీఎస్సీ నింపనుంది. ఎంపికైన వారికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) 157వ కోర్సు, ఇండియన్ నేవల్ అకాడమీ 119వ కోర్సులోకి ప్రవేశం కల్పిస్తారు.
ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు 394(పురుషులు 370, మహిళలు 24) ఆర్మీ 208(పురుషులు 198, మహిళలు 10) నేవీ 42(పురుషులు 37, మహిళలు 5)
ఎయిర్‌ఫోర్స్‌లో...
ఫ్లయింగ్ 92(పురుషులు 90, మహిళలు 2) గ్రౌండ్ డ్యూటీ్‌స(టెక్) 18(పురుషులు 16, మహిళలు 2) గ్రౌండ్ డ్యూటీ్‌స(నాన్ టెక్) 10(పురుషులు 8, మహిళలు 2) నేవల్ అకాడమీ(10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) 24(పురుషులు 21, మహిళలు 3)
అర్హత: పోస్టులను అనుసరించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశిత ఎత్తుకు తోడు వయోపరిమితి నిబంధనలను కూడా పాటించాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఎస్‌ఎ్‌సబి టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా రాత పరీక్షలో చెరి రెండున్నర గంటల కాలవ్యవధితో రెండు పేపర్లు.... మ్యాథమెటిక్స్ 300 మార్కులకు, జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600 మార్కులకు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు 900 మార్కులకు ఎస్‌ఎ్‌సబీ/ఇంటర్వ్యూ ఉంటుంది.
సీడీఎస్
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసె్‌స(సీడీఎస్) ఎగ్జామినేషన్ 2026కి సంబంధించిన మొదటి నోటిఫికేషన్ ఇది. దీని ద్వారా వివిధ సైనిక అకాడమీల్లో 451 ఖాళీలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది.
ఖాళీల వివరాలు: ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్ 100, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమెలా 26, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(మెన్), చెన్నై 275, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(ఉమన్) 18
అర్హత: ఆకాడమీ/ ట్రైనింగ్ సెంటర్‌ను అనుసరించి డిగ్రీ/ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశిత వయస్సు తదితర అర్హతలు కూడా ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఎస్‌ఎ్‌సబీ, వైద్య పరీక్షల ఆధారంగా
రాతపరీక్ష: ఒక్కోటి రెండు గంటలు కాలవ్యవధి, 100 మార్కులకు మొత్తం మూడు పేపర్లు ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఆపీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరేందుకు మొదటి రెండు పేపర్లు మాత్రమే ఉంటాయి. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు సైతం మొదటి మూడు అకాడమీలకు 300 మార్కులకు, ఆపీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరేందుకు 200 మార్కులకు ఉంటుంది.
రెండు నోటిఫికేషన్లకూ
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబర్ 30
వెబ్‌సైట్: upsconline.nic.in
సీడాక్ పీజీ సర్టిఫికెట్స్
కేంద్ర కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని సెంటర్ ఫర్ డెవల్‌పమెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్) వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీటీ డొమైన్‌లో వివిధ పీజీ సర్టిఫికెట్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సీడాక్ సెంటర్లు ఈ కోర్సులను అందిస్తున్నాయి.
కోర్సులు: అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీఎల్‌ఎ్‌సఐ డిజైన్, మొబైల్ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ సెక్యూర్ సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్, హెచ్‌పీసీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, రోబోటిక్స్ అండ్ అలైడ్ టెక్నాలజీస్, ఫిన్‌టెక్ అండ్ బ్లాక్‌చెయిన్ డెవల్‌పమెంట్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్స్(ఇవన్నీ 24 వారాల కోర్సులు)
అర్హత: ఇంజనీరింగ్‌లో ఎంపిక చేసిన స్ట్రీమ్స్ లేదా సైన్స్‌లోనూ ఎంపిక చేసిన పీజీ స్ట్రీమ్స్, ఎంసీఎ ఉత్తీర్ణత
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబర్ 29
కామన్ అడ్మిషన్ టెస్ట్ తేదీ: వచ్చే ఏడాది జనవరి 10, 11
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్స్: www.cdac.in,acts.cdac.in
Updated Date - Dec 15 , 2025 | 02:50 AM