ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Scholarship Deadlines: ఎస్‌బీఐ ప్లాటినమ్‌ జూబ్లీ అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌

ABN, Publish Date - Sep 22 , 2025 | 05:51 AM

చదువులో ప్రతిభ కనపరిచే విద్యార్థుల కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ‘ప్లాటినమ్‌ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్‌ 2025ని ప్రకటించింది. ఈ సంవత్సరం...

ఎస్‌బీఐ ప్లాటినమ్‌ జూబ్లీ

చదువులో ప్రతిభ కనపరిచే విద్యార్థుల కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ‘ప్లాటినమ్‌ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్‌ 2025ని ప్రకటించింది. ఈ సంవత్సరం ఎస్‌బీఐ ప్లాటినమ్‌ జుబ్లీని జరుపుకుంటున్నందుకు గుర్తుగా దీనిని ప్రారంభించారు. 90 కోట్లతో దేశవ్యాప్తంగా 23,200 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షి్‌పను అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు చదువుకునే పేద విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కింద కోర్సులను బట్టి 15 వేల నుంచి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు.

  • పాఠశాల విద్యార్థులు, అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, వైద్య విద్యార్థులు, ఐఐటీ, ఐఐఎం విద్యార్థులతోపాటు ఓవర్సీస్‌ విద్యార్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు

అర్హత: ఈ స్కాలర్‌షి్‌పనకు అర్హత సాధించాలంటే విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో 75 శాతం మార్కులు లేదా 7 సీజీపీఏ సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం పాఠశాల కేటగిరీకి అయితే మూడు లక్షలు, ఇతర కేటగిరీలకైతే ఆరు లక్షలు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు పది శాతం సడలింపు ఉంటుంది. మార్కుల్లో అయితే 67.5 శాతం/ 6.30 సీజీపీఏ సాధించాలి. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

చివరి తేదీ: 2025 నవంబర్‌ 15

వెబ్‌సైట్‌: https://www.sbiashascholarship.co.in/

అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌

ఆర్థికంగా వెనకబడి, ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థినుల కోసం ఇచ్చే ‘అజీమ్‌ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌’ కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థినులకు సంవత్సరానికి 30 వేల రూపాయలు(పదిహేను వేల రూపాయల చొప్పున రెండు విడతలు) అందజేస్తారు. వీరు రెగ్యులర్‌ పద్ధతిలో గ్రాడ్యుయేషన్‌ లేదా డిప్లొమా చదువుతూ ఉండాలి. తెలంగాణ సహా భారత దేశంలోని 19 రాష్ట్రాల బాలికలు ఈ ఉపకార వేతనానికి అర్హులు.

అర్హత: ప్రభుత్వ విద్యా సంస్థల్లో రెగ్యులర్‌ పద్ధతిలో పది, ఇంటర్‌ పూర్తి చేసి ఉండాలి.

  • ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేషన్‌ లేదా డిప్లొమా కోర్సు(2 నుంచి 5 సంవత్సరాల కాల వ్యవధి)లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొంది ఉండాలి.

జత పరచాల్సినవి:

  • ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్‌ ఫోటో

  • తెల్లకాగితంపై చేసిన సంతకం

  • కలర్డ్‌ ఆధార్‌ కాపీ(పేరు, పుట్టిన తేదీ, ఫోటో తదితర వివరాలన్నీ స్పష్టంగా కనిపించేలా ఉండాలి).

  • బ్యాంక్‌ పాస్‌బుక్‌లోని మొదటి పేజీ(పేరు, అకౌంట్‌ నంబర్‌, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌, చిరునామా తదితరాలన్నీ స్పష్టంగా కనిపించాలి), పది, ఇంటర్‌ మార్కుల మెమోలు.

  • కాలేజీ అడ్మిషన్‌ రుజువులు(బోనోఫైడ్‌ సర్టిఫికెట్‌ అయినా ఫర్వాలేదు)

పూర్తి వివరాల కోసం

(https://azimpremjifoundation.org/) వెబ్‌సైట్‌ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 05:51 AM