విద్యా రంగం, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గిస్తూ విద్యను ఉద్యోగయోగ్యంగా మార్చడంలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్న 'ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టిస్'
ABN, Publish Date - Jul 16 , 2025 | 12:30 PM
Professor Of Practice: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మారిపోతున్నాయి. ఉద్యోగాల స్వభావం, అవసరమైన నైపుణ్యాలూ వేగంగా మారుతున్నాయి. భారత్ లాంటి దేశంలో ఇది మరింత కీలకం. ఎందుకంటే ప్రతి సంవత్సరం 1 కోటి నుంచి 1.2 కోట్ల యువత ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. ఈ 'డెమోగ్రాఫిక్ డివిడెండ్' మనకు గొప్ప అవకాశమే.
హైదరాబాద్, జులై 16: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మారిపోతున్నాయి. ఉద్యోగాల స్వభావం, అవసరమైన నైపుణ్యాలూ వేగంగా మారుతున్నాయి. భారత్ (India) లాంటి దేశంలో ఇది మరింత కీలకం. ఎందుకంటే ప్రతి సంవత్సరం 1 కోటి నుంచి 1.2 కోట్ల యువత (Youth) ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. ఈ 'డెమోగ్రాఫిక్ డివిడెండ్' మనకు గొప్ప అవకాశమే. కానీ ఈ అవకాశాన్ని దేశ అభివృద్ధిగా మలచుకోవాలంటే, విద్యా వ్యవస్థే కీలకం. విద్యార్థులు కొత్త అవకాశాలకు సిద్ధంగా ఉండేలా శిక్షణ ఇవ్వగలిగితేనే అది సాధ్యమవుతుంది. 2030 నాటికి భారత్కు 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే, ఆ లక్ష్యాన్ని చేరగల నైపుణ్యాలతో కూడిన యువతరం అవసరం. భారతదేశంలో ఉద్యోగయోగ్యతపై గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. వీబాక్స్ సంస్థ, ఏఐసిటిఈ, సిఐఐ, అసోసియేషన్ అఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సహకారంతో విడుదల చేసిన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం 2019 లో 47.28 శాతం ఉన్న ఉద్యోగయోగ్యత శాతం 2025 నాటికి 54.81కి చేరింది. ఇది కొంత పురోగతే. కానీ ఇంకా 45 శాతానికి పైగా లోటు ఉంది. అంటే అనేక మంది పట్టభద్రులలో పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు ఉండడం లేదు. వారికి ఇండస్ట్రీ అనుభవం దొరకడం లేదు. అందుకే ఆధునిక ఉద్యోగాలకు సరిపణీ నైపుణ్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇడ పాత విద్యా విధానాలు వేగంగా మారుతున్న టెక్నాలజీ, పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా మారలేకపోతున్నాయి. మన విద్యార్థులు పాఠాలు బాగా చదవడమే కాదు, జీవితంలో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ఇండస్ట్రీ రెడీ నైపుణ్యాలు కూడా కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? 2020లో తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం, విద్యార్థుల్ని ఉద్యోగాల అవసరాలకు తగ్గట్టు తయారు చేయాలంటే స్కిల్ బెస్ట్ లెర్నింగ్ ని మరియు విద్యా సంస్థలను పరిశ్రమలతో కలసి పనిచేయమని ప్రోత్సహించింది. దీనినే దృష్టిలో ఉంచుకుని, దేశంలో ఉన్న ఉన్నత విద్య నియంత్రణ సంస్థలు అయిన యూజీసీ, ఏఐసిటిఈ "ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్" మోడల్ను ప్రవేశ పెట్టాయి. దీనిపల్ల పరిశ్రమల అనుభవం నేరుగా తరగతుల్లోకి వస్తుంది. చదువుకి ఉద్యోగానికి మధ్య ఉన్న గ్యాప్ తగ్గే అవకాశం ఉంటుంది.
ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఏంటి?
ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టిస్ అనేది పరిశ్రమల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పాత్ర. వీరిని ఉన్నత విద్యా సంస్థలు నియమించుకుంటాయి. వీరు తరగతుల్లో బోధనతో పాటు విద్యార్థులకు కెరీర్ మార్గనిర్దేశం చేస్తారు. వీరి ప్రత్యేకత ఏంటంటే వీరి దగ్గర పరిశ్రమలలో పని చేసిన అనుభవంతో పాటు ఆధునాతన టెక్నాలిజీలలో ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటాయి. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టిస్ గా నియమించబడాలంటే పరిశ్రమల్లో గణనీయమైన అనుభవం ఉండాలి. పెద్ద సంస్థల్లో కీలక పదవుల్లో పని చేసిన అనుభవం ఉండాలి. లేకపోతే స్టార్టస్లు ప్రారంభించడం, పేటెంట్లు నమోదు చేయడం వంటి ఇన్నొవేషన్ ఫీల్డ్ లో నిరూపించుకున్నవాళ్ళు కూడా ఈ పాత్రకు అర్హులు. అసోసియేట్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టిన్ పోస్టులకు కూడా అనుభవానికి తగిన ప్రమాణాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరిని ఎంచుకున్నా, వారు తరగతుల్లోకి అసలైన అనుభవాన్ని తీసుకొచ్చే వాళ్లే అయి ఉండాలి. ఉదాహరణకు పిహెచ్డ్ చేసి, ప్రముఖ టెక్ కంపెనీల్లో పదేళ్లకుపైగా డేటా సైన్స్ అల్గోరిథమ్స్ రూపొందించిన అనుభవజ్ఞుడు 'ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టిస్'గా విద్యార్థులకు విలువైన ప్రాక్టికల్ విజ్ఞానం అందించగలడు. అదే విధంగా, కేవలం బి. టెక్ పూర్తిచేసి, ఏడు సంవత్సరాల పాటు మిషన్ లెర్నింగ్ రంగంలో చక్కటి అనుభవం పొందిన ఇంజనీర్ కూడా 'అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టిన్'గా, నేటి తరం టెక్ టాలెంట్ని సిద్ధం చేయగలడు. ఇందులో విశేషం ఏంటంటే ఆవిష్కరణకు కూడా గౌరవం ఉంది. బదు పేటెంట్లు కలిగి ఉండి, ఏదైనా సంస్థలో (స్టార్టప్ సహా) కనీసం అయిదేళ్లు పని వేసిన ప్రొఫెషనలకు కూడా ఈ అవకాశం లభిస్తుంది. అంటే, సాధించిన పని ముఖ్యం సాంప్రదాయ డిగ్రీలు మాత్రమే కాకుండా.
ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టిస్ ముఖ్య ఉద్దేశాలు, అమలు విధానం
టెక్నికల్ కోర్సులకు సంబంధించి ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం, ఒక విద్యాసంస్థలో మొత్తం ఫ్యాకల్టీ పదవులలో 20 శాతం వరకు ఈ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టిస్ గా నియమించవచ్చు. ఇందులో 5 శాతం స్థానాలు మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. విధానంతో విద్యలో వైవిధ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా పరిశ్రమలలో ఉన్న తాజా ఆసుభవాన్ని తరగతుల్లోకి తీసుకురావాలన్న లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది. ఇదొక అదనపు ఆవకాశం మాత్రమే. ఇవి మౌలిక బోధనా సిబ్బందికి ఐదులుగా కాదు. ఇదిలా ఉండగా, వీరికి పారితోషికాన్ని పరిశ్రమలు లేదా విద్యా సంస్థలు చెల్లించవచ్చు. గౌరవానుకూలంగా పనిచేసే అవకాశాన్ని కూడా కల్పించవచ్చు.
పరిశ్రమల్లో అనుభవం ఉన్న నిపుణులను విద్యా వ్యవస్థలోకి నిర్మితంగా, ఫలితాలపైన దృష్టి పెట్టే రీతిలో తీసుకురావడమే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టిన్ మోడల్ ఉద్దేశం. ఈ విధానంతో విద్యాసంస్థలు పరిశ్రమ నైపుణ్యం కలిగినవారిని తరగతుల్లోకి తీసుకుని విద్యార్థులకు అసలైన ప్రయోజనం కలిగించగలుగుతాయి. ఫలితంగా విద్యా రంగం - పరిశ్రమల మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుంది.
ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పాత్రలో ఉన్నవారు విద్యా పాఠ్యాంశాల్లో నిజజీవితానికి తగ్గట్టుగా మార్పులు తీసుకువస్తారు. ప్రస్తుతం పరిశ్రమల్లో ఏమవుతోంది? రాబోయే రోజుల్లో ఏం కావాలి? అనే దానికి అనుగుణంగా కోర్సులను తీర్చిదిద్దుతారు. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వేగంగా మారుతున్న రంగాల్లో వీరి పాత్ర కీలకం. కేస్ స్టడీలు, ప్రాక్టికల్ అనుభవాల ద్వారా నేర్పే శైలి వీరి ప్రత్యేకత, దాంతో విద్యార్థుల్లో పని చేయగల నైపుణ్యాలు, ఆలోచించే శక్తి పెరుగుతుంది. మార్కెట్లో లో ఎక్కడ లోపాలున్నాయో వారికి స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి విద్యార్థుల్లో ఆవిష్కరణలు, స్టార్టవ్ ఆలోచనలను ప్రోత్సహిస్తారు. అంతేకాదు పరిశ్రమల్లో వీరికి ఉన్న వారి సంబంధాలు విద్యార్థులకు ఇంటర్నేషన్లు, ప్లేస్మెంట్ల అవకాశాలను పెంచుతాయి. పాఠాలు చెప్పడమే కాకుండా కెరీర్ లో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై తగిన మార్గనిర్దేశం చేస్తారు.
భవిష్యత్తు ఏంటి?
అకాడెమియా మరియు ఇండస్ట్రీ మధ్య ఉన్న గ్యాపు తగ్గించేందుకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టిస్ మోడల్ చక్కటి మార్గంగా కనిపిస్తున్నా దీని అమలు మాత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఆశాజనకంగా ఉన్నప్పటికీ, కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. విద్యాసంస్థల్లో అవగాహన పెంచేందుకు యూజీసీ, ఏఐసిటిఈ తరచూ నిర్వహిస్తున్నాయి. ఫ్లెక్సిబుల్ టిమింగ్స్, హైబ్రిడ్ మోడల్స్, పరిశ్రమల సహకారంతో హాసరేలియమ్ ఇస్తే, టాప్ ఇండస్ట్రీ సెషన్లు, వర్క్షాప్లు నిపుణులు భోదన రంగంలోకి వచ్చేలా తోడ్పడుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సంస్థలు గ్రాంట్లు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగస్వామ్యాల ద్వారా మరింత ప్రోత్సాహం కల్పించవచ్చు.
దేశ ఆర్థిక పరిస్థితి వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ మోడల్ ఒక కీలక లువుగా నిలుస్తోంది. దీన్ని పూర్తిస్థాయిలో ప్రయోజనకరంగా మార్చాలంటే, దీన్ని విద్యాసంస్థలు దీర్ఘకాలిక భాగస్వామ్యంగా చూడాలి. ఇలా చేస్తే విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. థియరీ మరియు ప్రాక్టీస్ మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుంది. విద్యార్థులకు, బోధన సిబ్బందికి దీర్ఘకాల ప్రయోజనం ఉంటుంది. ఫలితాలపైనే ఆధారపడే నేటి విద్యా వ్యవస్థలో, పరిశ్రమ అనుభవం గల నిపుణులతో నిర్మితంగా పనిచేయడం వలన విద్యాసంస్థలు బలంగా, పరిశ్రమలకు సన్నద్ధంగా, భవిష్యత్తుపై దృష్టి పెట్టేలా ఎదుగుతాయి.
NxtWave Institute of Advanced Technologies
కపిల్ కావురి హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ , తెలంగాణ, 500032
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి పతకం
Updated Date - Jul 16 , 2025 | 12:39 PM