ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fashion design courses: సృజనాత్మకతకు చిరునామా

ABN, Publish Date - Dec 22 , 2025 | 04:11 AM

ఒక వస్తువుతో కలిగే ప్రయోజనంలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం అందాన్ని జోడించడమే ఫ్యాషన్‌కు అర్థంగా చెప్పుకోవచ్చు. మనం అనునిత్యం...

ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు ఎన్‌టీఏ నోటిఫికేషన్‌

ఒక వస్తువుతో కలిగే ప్రయోజనంలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం అందాన్ని జోడించడమే ఫ్యాషన్‌కు అర్థంగా చెప్పుకోవచ్చు. మనం అనునిత్యం ధరించే దుస్తులు, పాదరక్షలు, వాచీ తదితరాలన్నింటిలో వస్తు ప్రయోజనానికి తోడు అందానికి కూడా ప్రాధాన్యం ఇస్తాం. ఆ అందం, అంతకుమించి ట్రెండ్‌ను కలగలిపి కోర్సులుగా మలచిన సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌). హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఉన్న నిఫ్ట్‌ సెంటర్లు ఫ్యాషన్‌ రంగంలో వివిధ కోర్సులు - యూజీ, పీజీ, పిహెచ్‌డీని అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది.

  • యూజీ కోర్సుల కాలవ్యవధి నాలుగేళ్ళు. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైనింగ్‌ అలాగే ఫ్యాషన్‌ టెక్నాలజీలో ఈ కోర్సులు ఉన్నాయి. ప్యాషన్‌ కమ్యూనికేషన్‌, యాక్సెసరీ డిజైన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ ఇంటీరియర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణులు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. అడ్మిషన్‌ ఏడాది అంటే వచ్చే ఏడాది ఆగస్టు 1 నాటికి ఈ కోర్సుల్లో చేరబోయే విద్యార్థి వయస్సు 24 సంవత్సరాలకు మించకూడదు.

  • డిగ్రీ ఉత్తీర్ణులు పీజీ కోర్సులు చేసేందుకు అర్హులు. మాస్టర్స్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్స్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్స్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి.

  • ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే ఏడాది జనవరి 6లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

  • ఈ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన పరీక్షలో జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ కంప్యూటర్‌ ఆధారిత ఎగ్జామ్‌. క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌ పెన్ను - పేపర్‌ ఆధారిత పరీక్ష. కొన్ని యూజీ కోర్సులకు అదనంగా సిట్యుయేషన్‌ టెస్ట్‌ ఉంటుంది. అలాగే పీజీ కోర్సులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. వివిధ టెస్టులకు వేర్వేరు వెయిటేజీలు ఉంటాయి. వాటి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

వెబ్‌సైట్స్‌: http-s://exams.nta.nic.in/niftee/, www.nta.ac.in, www.nift.ac.in

Updated Date - Dec 22 , 2025 | 04:11 AM