MAT Exam Schedule: మ్యాట్
ABN, Publish Date - Dec 01 , 2025 | 04:10 AM
దేశంలోని బిజినెస్ స్కూళ్ళలో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్షల్లో మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మ్యాట్ ఒకటి. ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్....
దేశంలోని బిజినెస్ స్కూళ్ళలో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్షల్లో మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) ఒకటి. ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) దీన్ని ఏటా నాలుగుసార్లు నిర్వహిస్తుంది. ప్రస్తుతం డిసెంబర్‌లో నిర్వహించే పరీక్షకు ప్రకటన ఇచ్చింది. డిగ్రీ ఉత్తీర్ణులకు తోడు కోర్సు చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పేపర్ బేస్డ్ టెస్ట్(పీబీటీ), కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) అలాగే పీపీటీ+సీబీటీగా అంటే మూడు రకాలుగా ఈ టెస్ట్‌ను నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీలకు తోడు దేశవ్యాప్తంగా ఆరువందలకుపైగా సంస్థల్లో ప్రవేశానికి ఈ స్కోర్ ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో సాధించిన స్కోర్ ఏడాది పాటు చెల్లుతుంది.
రెండు గంటల వ్యవధికలిగిన ఈ పరీక్షలో అయిదు విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, మేథమెటికల్ స్కిల్స్, డేటా అనాల్సిస్ అండ్ సఫిసియెన్సీ, ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. సమాధానాన్ని కరెక్ట్‌గా గుర్తిస్తే ఒక మార్కు ఇస్తారు. తప్పుగా గుర్తిస్తే పావు మార్కు తగ్గిస్తారు. వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నలు ఉన్నాయి. ఇటు క్యాట్, అటు ఐసెట్‌కు మధ్యస్థంగా మ్యాట్ ఉంటుంది.
పీబీటీ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: డిసెంబర్ 7
సీబీటీ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: డిసెంబర్ 15
పేపర్ ఆధారిత పరీక్ష తేదీ: డిసెంబర్ 13
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: డిసెంబర్ 21
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: పేపర్ ఆధారిత - హైదరాబాద్, విశాఖపట్టణం; కంప్యూటర్ ఆధారిత - హైదరాబాద్, విజయవాడ
వెబ్‌సైట్: https://mat.aima.in
Updated Date - Dec 01 , 2025 | 04:10 AM