ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amazon Placement: ఆ స్టూడెంట్ ప్యాకేజ్‌ చూస్తే కళ్లు చెదరాల్సిందే.. ప్రియాంక సక్సెస్ స్టోరీ

ABN, Publish Date - May 01 , 2025 | 11:40 AM

Priyanka Reddy Amazon Placement: గీతం విద్యార్థిని కారుమూరు ప్రియాంకా రెడ్డి ప్రతిష్టాత్మక అమేజాన్ సంస్థలో ఉద్యోగం సాధించింది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం క్యాంపస్‌లో విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు.

Priyanka Reddy Amazon Placement

శ్రద్ధతో చదవితే మంచి భవిష్యత్ ఉంటుందనేది నిజమైన మాట. రాత్రింబవళ్లు కష్టపడి చదివితే.. ఆ కష్టానికి ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. ఉన్నత చదువులు బంగారు భవిష్యత్‌కు పునాది వంటిది. మీ టాలెంట్‌ చూసి జాబ్‌లు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కూడా. ఇదిలా ఉండగా.. కష్టపడి చదివితే మంచి ఉన్నత ఉద్యోగం సాధించవచ్చని నిరూపించింది ఓ విద్యార్థిని. ఏడాది రూ.1.4 కోట్ల వేతనంతో ప్లేస్‌మెంట్ సాధించి ఔరా అనించింది. తన నాన్నను చూసి కోడింగ్ నేర్చుకున్నానని చెబుతున్న ఆ స్టూడెంట్ ఎవరు.. ఆమె తన చదువుకోసం ఎలా ప్రిపేర్ అయ్యిందో తెలుసుకుందాం.


గీతం విద్యార్థిని కారుమూరు ప్రియాంకా రెడ్డి ప్రతిష్టాత్మక అమేజాన్ సంస్థలో ఉద్యోగం సాధించింది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం క్యాంపస్‌లో విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. ప్రియాంక గీతం యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌లో సీఎస్సీ విద్యార్థిని. 2024-25 విద్యాసంస్థరంలో దాదాపు 275కు పైగా బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ గీతంలో ప్రాంగణ నియామకాలు నిర్వహించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అత్యధికంగా యాక్సెంచర్ కంపెనీకి 91 మంది విద్యార్థులు ఎంపికవగా, టెక్‌ మహేంద్ర కంపెనీకి 87 మంది, రీనెక్స్ టెక్నాలజీ సంస్థకు 70 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రకటించారు. అట్లాసియన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, డెలైట్, హెచ్‌ఎస్‌బీసీ వంటి సంస్థలు ఆకర్షిణీయమైన వేతనాలతో వివిధ విభాగాలకు చెందిన గీతం విద్యార్థులను ఎంపిక చేసినట్టు పేర్కొన్నాయి.

May Day wishes: కార్మికులకు సీఎం చంద్రబాబు, లోకేష్ మేడే శుభాకాంక్షలు


నాన్నే ఇన్స్పిరేషన్: ప్రియాంక

తాను సాధించిన దానిపట్ల విద్యార్థిని కారుమూరు ప్రియాంకా రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తన నాన్నే తనకు ఇన్స్పిరేషన్ అని ఆమె చెప్పుకొచ్చారు. తన తండ్రి చూసే కోడింగ్‌లో చాలా ఇంట్రెస్ట్ పెరిగిందన్నారు. క్యాంపెస్ ప్లేస్‌మెంట్స్‌లో అమేజాన్‌తో పాటు తనకు మరో రెండు కంపెనీల్లో అవకాశం వచ్చిందని.. అయితే అమెజాన్‌లో చేరేందుకే మొగ్గు చూపినట్లు తెలిపారు. అమెజాన్‌లో రూ.1.4కోట్ల వేతనంతో ఉద్యోగం సాధించడం పట్ల తాను సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. యూకే కేంబ్రిడ్జ్‌లో అమేజాన్ ప్లేస్‌మెంట్ వచ్చిందన్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చానన్నారు. ఆన్‌లైన్‌లో ఎన్నో కోడింగ్ క్లాసెస్ ఉన్నాయన్నారు. రోజు రెండు గంటల పాటు కోడింగ్ నేర్చుకునేందుకు స్పెండ్ చేయాలన్నారు.


ఈ ఘనత వారిదే: ప్రియాంక తండ్రి

ఈ సందర్భంగా ప్రియాంక తండ్రి కూడా ఆనందం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ సిబ్బంది ప్రోత్భలం, ప్రోత్సాహంతోనే తమ కూతురు ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. గీతం వర్సిటీలో సీఎస్సీ తీసుకున్న సమయంలో మార్క్‌లు ఒక్కటే ముఖ్యం కాదని, సబ్జెక్ట్‌ను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని తన కూతురికి చెప్పానన్నారు. మార్క్స్ పరంగా కాకుండా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌‌గా ఉంటే పెద్ద పెద్ద కంపెనీల్లో అచ్చీవ్‌మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సమయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పానని, ఇలా చిన్న చిన్న చెప్పానని.. చెప్పిందాన్ని ఫాలో అయ్యి తన కూతురు ఇంతటి విజయాన్ని సాధించినట్లు తెలిపారు. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక టీవీలు, సినిమా కాకుండా.. కొత్త కొత్త టెక్నాలజీని నేర్చుకునేదని ప్రియాంక తండ్రి అన్నారు.


ఇవి కూడా చదవండి

7th Class Girl: సెలవులకు ఇంటికెళ్తే పెళ్లి చేసేశారు

BC Janardhan: పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన


Read Latest Education News And Telugu News

Updated Date - May 01 , 2025 | 11:52 AM