ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

7267 Vacancies: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 7267 ఖాళీలు

ABN, Publish Date - Sep 22 , 2025 | 05:54 AM

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(ఈఎంఆర్‌ఎస్‌)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7267 టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. భారత ప్రభుత్వ గిరిజన...

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(ఈఎంఆర్‌ఎస్‌)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7267 టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద స్వయం ప్రతిపత్తితో నడుస్తున్న ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌’ ఈ ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌ను నిర్వహిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వేళ అర్హత ఉన్నట్లయితే అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అలాంటి అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధించిన ఫీజులను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

పోస్టుపేరు ఖాళీలు

  • ప్రిన్సిపాల్‌ 225

  • పీజీటీ 1460

  • హాస్టల్‌ వార్డెన్‌(పురుషులు) 346

  • జూనియర్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌(క్లార్క్‌) 228

  • అకౌంటెంట్‌ 61

  • స్టాఫ్‌ నర్స్‌(ఫీమేల్‌) 550

  • టీజీటీ 3962

  • హాస్టల్‌ వార్డెన్‌ (మహిళలు) 289

  • ల్యాబ్‌ అటెండెంట్‌ 146

  • మొత్తం ఖాళీలు 7267

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌, ఇంటర్‌, టెన్త్‌, డిప్లొమా పాసై ఉండాలి.

వయస్సు: ప్రిన్సిపాల్‌ పోస్టులకు 50 ఏళ్లు, హాస్టల్‌ వార్డెన్‌, మహిళా స్టాఫ్‌ నర్సు పోస్టుకు 35 ఏళ్లు, జూనియర్‌ సెక్రటేరియల్‌ అటెండెంట్‌కు 30 ఏళ్ల లోపు ఉండాలి.

ఫీజు: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రిన్సిపల్‌ పోస్టుకు రూ. 2500/-, టీజీటీ, పీజీటీ పోస్టులకు రూ.2000/-, నాన్‌ టీచింగ్‌ పోస్టులకు రూ.1500/-,

ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌, మహిళా అభ్యర్థులకు రూ.500/-

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మల్టిపుల్‌ ఆన్సర్‌ తరహాలో పెన్‌, పేపర్‌ పద్ధతిలో వంద ప్రశ్నలతో వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రిన్సిపాల్‌ పోస్టులకు రీజనింగ్‌, న్యూమరిక్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, అకడమిక్‌-రెసిడెన్షియల్‌ యాస్పెక్ట్స్‌, అడ్మినిస్ర్టేషన్‌, ఫైనాన్స్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, హిందీ లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ ఉంటుంది. పీజీటీ పోస్టులకు జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌, డొమైన్‌ నాలెడ్జ్‌ ఉంటుంది. టీజీటీ, ఇతర పోస్టులకు సిలబస్‌ కూడా దాదాపుగా అంతే ఉంటుంది. ఎన్‌ఈఎ్‌సటీఎస్‌ వెబ్‌సైట్‌లో పూర్తి సిలబస్‌ అందుబాటులో ఉంది.

పరీక్ష కేంద్రాలు: ప్రిన్సిపాల్‌ పోస్టులకు మాత్రం పరీక్ష ఢిల్లీలోనే నిర్వహిస్తారు. మిగిలిన పోస్టులకు సంబంధించి మాత్రం వచ్చిన దరఖాస్తులను అనుసరించి సెంటర్ల అలాట్‌మెంట్‌ ఉంటుంది.

చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 23

వెబ్‌సైట్‌: nests.tribal.gov.in/

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 05:54 AM