ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

ABN, Publish Date - Jun 11 , 2025 | 06:03 AM

‘‘నేను అధికారంలోకి వచ్చాక.. చాయ్ తాగినంత సేపట్లో మిమ్మల్ని రెగ్యులరైజ్‌ చేస్తా’’ హన్మకొండ ఏకశిలా పార్కు వద్ద ఆందోళన చేస్తున్న సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి అన్న మాటలివి...

‘‘నేను అధికారంలోకి వచ్చాక.. చాయ్ తాగినంత సేపట్లో మిమ్మల్ని రెగ్యులరైజ్‌ చేస్తా’’ హన్మకొండ ఏకశిలా పార్కు వద్ద ఆందోళన చేస్తున్న సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి అన్న మాటలివి. ఆయన సీఎం అయ్యాక ఇన్నాళ్లకైనా ఆ హామీలపై దృష్టి సారిస్తారా? రాష్ట్రంలో దాదాపు ఇరవై వేల మంది సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు ఇరవై ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. మండల వనరుల కేంద్రం, భవిత కేంద్రాల్లో, పాఠశాల స్థాయిలోని కేజీబీవీల్లో, డీపీఓ కార్యాలయంలో ఇలా పలు శాఖల్లో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. పది, ఇంటర్‌ ఫలితాల్లో గురుకుల పాఠశాలలతో సమానంగా కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారు. ఇందులో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల తోడ్పాటు ఎనలేనిది. గత సమ్మె సమయంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీతో ఏ ప్రయోజనమూ సాధించకుండానే ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు సమ్మెను విరమించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడచినా ప్రభుత్వం స్పందించకపోవడంతో గత డిసెంబర్‌లో వారు మళ్లీ సమ్మెకు దిగారు. మొత్తంగా 28 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ పెద్దల హామీతో, విద్యార్థుల పరీక్షలనూ దృష్టిలో ఉంచుకొని మళ్లీ సమ్మెను విరమించారు. గతంలో హామీ ఇచ్చినట్టుగా... ‘ఎస్‌ఎస్‌ఏ ఆర్థిక సంబంధ అంశాలు క్యాబినెట్ సబ్ కమిటీకి అప్పగింత, టర్మినేషన్ విధానం రద్దు, 28 రోజుల సమ్మె కాలపు పూర్తి వేతనం చెల్లింపు, పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లకు పూర్తి ఏడాది వేతనం చెల్లింపు, ప్రతి సంవత్సరం 20 శాతం జీతాల పెంపుతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏడాదికి పురుషులకు 22, మహిళలకు 27 సీఎల్స్, ఆప్షనల్ హాలిడేస్, అనారోగ్య పరిస్థితుల్లో వేతనంతో కూడిన సెలవులు, చైల్డ్ కేర్ లీవ్స్, రెసిడెన్షియల్‌ క్లస్టర్ల పెంపు’ వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయాలన్నప్పుడు కొన్ని సాంకేతిక, న్యాయపరమైన అడ్డంకులు రావచ్చు.

ఇప్పటివరకు ఎస్ఎస్ఏలో రెగ్యులర్ ఉద్యోగులంటూ ఎవరూ లేరు కాబట్టి వీరికి అలాంటి అడ్డంకులేవి రావు. రాతపరీక్ష, మెరిట్, రోస్టర్ ప్రకారమే వీరు భర్తీ అయ్యారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలతో (206 సంఘాలు)ఏర్పడిన టీజీఈ జేఏసీలో సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు కూడా భాగంగా ఉన్నారు. జేఏసీ 57 డిమాండ్లలో వారి డిమాండ్లు కూడా ఉన్నాయి. జేఏసీ డిమాండ్లపై ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటవడం సంతోషకరం. ఇప్పటికైనా వారు మా జేఏసీ డిమాండ్లను పరిశీలించి, మాకు సత్వర న్యాయం చేయాలి.

జుర్రు నారాయణ యాదవ్

టీజీఈ జేఏసీ కో–కన్వీనర్

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Read latest AP News And Telugu News

Updated Date - Jun 11 , 2025 | 06:03 AM