Share News

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:12 PM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఓ ప్రచారం అయితే పార్టీలో జోరుగా సాగుతోంది. అలాంటి వేళ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్
BJP MLA Raja SIngh

హైదరాబాద్, జూన్ 10: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం కుల సమీకరణ ఆధారంగా బీజేపీ అభ్యర్థిని నిర్ణయించబోతుందంటూ కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో జూబ్లీహిల్స్ టికెట్ రెడ్డి సామాజికవర్గానికే అంటూ పార్టీలో చర్చ ప్రారంభమైంది.

మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఆరు నెలల తర్వాత ఉంటుందని అన్నారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు బీఆర్ఎస్‌కి విక్రయించారని ఆరోపించారు. అయితే ఈసారి రానున్న ఉపఎన్నికలో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు.. బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా? లేక కాంగ్రెస్ పార్టీకి విక్రయిస్తారా? అనేది చూడాలన్నారు.


ఇక బీజేపీ విషయానికి వస్తే.. గతంలో కుల రాజకీయం జరిగిందన్నారు. మరి ప్రస్తుతం కూడా కుల రాజకీయం జరుగుతుందా? లేక పార్టీలోని సీనియర్లకు అవకాశం ఇస్తారా? అనేది చూడాల్సి ఉందని ఎమ్మెల్యే రాజా సింగ్ అభిప్రాయపడ్డారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో సోమవారం నాడు మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మాగంటి మృతిచెందారు. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.


మరోవైపు ఇటీవల హైదరాబాద్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రముఖులు సైతం ఇదే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజుల వ్యవధిలోనే రాజాసింగ్ మరోసారి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిట్‌గా మారింది. దీంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే వాదనకు బలం చేకూరినట్లు అవుతోంది.

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

అనంతపురం జిల్లా ఘటనపై చంద్రబాబు సీరియస్..

Read latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 08:32 PM