ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mortality: అంతా తూచ్..చ్..చ్

ABN, Publish Date - Dec 22 , 2025 | 04:40 AM

మరణం మొగ్గలేస్తుంది పండయి రాలిపోయేవరకు మన కంటపడదు..

మరణం మొగ్గలేస్తుంది పండయి రాలిపోయేవరకు

మన కంటపడదు

పైపై అందాలనే చూస్తాం

లోలోపలనుంచి మొలుచుకొచ్చే

మృత్యుకత్తులను అసలే పసిగట్టలేం

రసాలూరే మామిడిపండ్లు

చేతివేళ్ళ సందుల్లోంచి

కాలువలుగా పారుతున్నా

చెరగని మరకలుగా

దుస్తులపై ముద్రలు వేస్తున్నా

తినటం మాత్రం ఆపము

మృత్యువు

ఇష్టమైన తీపిని పంచే

మామిడి పండులాంటిదేనని

ఎంతమందిమి గ్రహిస్తాం

రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుతున్న

వ్యక్తిలోంచి లారీ దూసుకెళ్ళటం

వెనుక సీటుమీద కూర్చున్న వ్యక్తి

కళ్ళు తిరుగుతూ

వెల్లకిలా పడిపోవటం

ఎవరమైనా ఊహించగలుగుతామా

మనమంతా శూన్యంలోంచి

శూన్యంలోకే ప్రయాణం చేస్తున్నాము

ఒకటి రెండు

మూడు అంటూ వేసే

ఒక్కొక్క అడుగు

ఎక్కే ఒక్కొక్క మెట్టు

మన లెక్కలోనివే

అంతా తూచ్..చ్..చ్

గాలి పీల్చేంతవరకే

ఈ సుందర సుకుమార దరహాసం

చిలుకెగిరిపోయాక

పగిలిపోయే పనికిరాని పాత్రలమే

ఉన్నంతసేపు

గుండెకు

గుండెకు మధ్య

ఎప్పటికీ కూలిపోని

ప్రేమవారథి కట్టుకోవటమే

మనం చేయాల్సిందల్లా!

తండ హరీష్ గౌడ్

& 89784 39551

Updated Date - Dec 22 , 2025 | 04:41 AM