ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Freedom: త్యాగదీప్తి దేశ స్ఫూర్తి

ABN, Publish Date - Aug 15 , 2025 | 01:46 AM

వీర పుత్రులు గన్న వసుంధరీ ఈ జననీ.. ధీర పుత్రులు వున్న పురంధరీ ఈ అవనీ.. త్యాగాల నా తల్లి తనువెల్లా రగిలింది బానిసత్వ బతుకుల్లో బాధల్ని మ్రింగింది...

వీర పుత్రులు గన్న వసుంధరీ ఈ జననీ..

ధీర పుత్రులు వున్న పురంధరీ ఈ అవనీ..

త్యాగాల నా తల్లి తనువెల్లా రగిలింది

బానిసత్వ బతుకుల్లో బాధల్ని మ్రింగింది

కష్టాల కడలిలో కన్నీరు కార్చింది

చెరసాల చెలిమిలో చరితల్ని రాసింది

శరాలను సంధించిన వీరోచిత పోరాటం

శరీరాలు బంధించిన ఆకాంక్షల ఆరాటం

అల్లూరి సారథిగా అడుగేసిన వెలుగుబాట

తెల్లోడి గుండెల్ని వణికించిన తెలుగుపాట

సత్యాగ్రహ శాంతిదూత గాంధీజీ నెహ్రూజీ

వీరగాథ ఛత్రపతి శివమెత్తిన శివాజీ

మీసాలను మెలిపెట్టిన భగత్‌సింగు సుభాసు

మోసాలను కనిపెట్టిన భరతమాతే శెభాసు

రాజ్యాంగ నిర్మాణము రాచబాట వేసిన రోజు

అంబేద్కరుడి ఆశయ వెలుగులు నిండిన రోజు

సమానత్వ ఉషస్సులు ప్రసరించిన పండుగ రోజు

సర్వ సత్తాక ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన రోజు

బాధించిన పరతంత్రం స్వేచ్ఛా హృది ఆర్తి

సాధించిన స్వాతంత్రం విరజిమ్మిన త్యాగ దీప్తి

అలుపెరగని ధీరత్వం అదే మన దేశ స్ఫూర్తి

మువ్వన్నెల జెండాతో మురిసింది జాతి కీర్తి

డా.కటుకోఝ్వల రమేష్

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 01:46 AM