ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Philosophical Poetry: గోపికగా మారాక

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:19 AM

బ్రతుకంతా పదహారేళ్ళ ప్రాయంగా తోస్తుంది, బద్ధకమనేది దరిదాపులకైనా రాకుండా పారిపోతుంది, చిరుచిరుచీకట్లలోనే తెల్లవారుతుంది...

బ్రతుకంతా పదహారేళ్ళ ప్రాయంగా తోస్తుంది

బద్ధకమనేది దరిదాపులకైనా రాకుండా పారిపోతుంది

చిరుచిరుచీకట్లలోనే తెల్లవారుతుంది

చిరునవ్వులతోనే ప్రతిరోజూ మొదలవుతుంది

ప్రపంచం పరుగులు తీసే గమ్యాలన్నిటినీ

కంటిచివరి నుంచి చూసి మనసు తలతిప్పుకుంటుంది

మనోలోకమనే కొలనులో ఒక్క రాయైనా విసరకుండా

రోజు గడిచిపోవడం తెలుస్తుంది

కనుల నిండుగా ఒకటే రూపం

మౌనంగా మరల మరల అదే నామం

తిరుగుబోతు మనసుకు ఎటు వెళ్ళినా

అతని చేయి విడువననే పంతం

విరహంలా కనిపించే సంయోగం

విముక్తిని కోరని వైభోగం

సూర్యుడు వెళ్తున్నపుడూ

చంద్రుడు మెల్లమెల్లగా వస్తున్నపుడూ

కనుల ముందు మనోసంద్రాన్ని ఉప్పొంగజేసే

ఒకేఒక దరహాసం

కనులు మూసుకుంటే అతని గాఢాలింగనం

ఎపుడైనా ఒక కలవస్తే

అందులోనూ అతనిదే స్వైరవిహారం

         

టి. శ్రీవల్లీ రాధిక

Updated Date - Jun 30 , 2025 | 12:19 AM