ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telugu Poetry Competition: ఈ వారం వివిధ కార్యక్రమాలు 11 08 2025

ABN, Publish Date - Aug 11 , 2025 | 01:17 AM

కవితల పోటీ, పాలమూరు సాహితి అవార్డు, కథల పోటీ, కవిత, కథ సంపుటాల పోటీ, ‘హాసిని రామచంద్ర’ అవార్డులు...

కవితల పోటీ

సాహితీకిరణం సౌజన్యంతో కొసరాజు ఆర్తి & జాహ్నవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ‘అంతా అవినీతి మయం – అంతం చేయాలి మనమిక’ అనే అంశంపై జాతీయ స్థాయి కవితల పోటీ నిర్వహిస్తున్నది. మొత్తం ఏడు బహుమతులు ఉంటాయి. ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా: రూ.3వేలు, రూ.2వేలు. ఒక్కొక్కటి రూ.1000 చొప్పున ఐదు సమాన బహుమతులు. కవిత 20 లైన్లకు తగ్గకుండా 30 లైన్లకు మించకుండా ఉండాలి. హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి. కవులు తమ కవితలను ఆగస్ట్‌ 31 లోగా పోస్టు/ కొరియర్‌ ద్వారా మాత్రమే పంపాలి. చిరునామా: ఎడిటర్‌, సాహితీ కిరణం ఇం.నెం. 11–13–154, అలకాపురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌ – 500102. సెల్‌: 94907 51681.

పొత్తూరి సుబ్బారావు

పాలమూరు సాహితి అవార్డు

గత పదిహేను సంవత్సరాలుగా పాలమూరు సాహితి కవితా సంపుటాలకు పురస్కారాలను అందజేస్తున్నది. ఈ అవార్డుకు 2024 సంవత్సరానికి గాను కాంచనపల్లి గోవర్ధన్ రాజు ‘పెంకుటిల్లు’ కవితా సంపుటి ఎంపికైంది. త్వరలో ఈ పురస్కారానికి గాను కాంచనపల్లికి రూ.5,116 నగదు, జ్ఞాపిక, శాలువతో సత్కారం ఉంటుంది. వివరాలకు: 90328 44017.

భీంపల్లి శ్రీకాంత్

కథల పోటీ

జాగృతి వారపత్రిక ఏటా దీపావళికి నిర్వహించే భండారు సదాశివరావు స్మారక కథల పోటీకి కథలను ఆహ్వానిస్తున్నాం. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా: రూ.12వేలు, రూ.7వేలు, రూ.5వేలు. కథలు సెప్టెంబర్‌ 10లోగా చిరునామా: జాగృతి భవన్‌, 3–4–228/4/1, లింగంపల్లి, కాచిగూడ, హైదరాబాద్‌ – 27, ఫోన్‌– 99599 91304.

జాగృతి వీక్లీ

కవిత, కథ సంపుటాల పోటీ

రాజా వేంకట కుమార మహీపతిరావు సూర్యారావు బహుదూర్‌ గారి 140వ జయంతి ఉత్సవాల సందర్భంగా పిఠాపురం మహారాజా ఫౌండేషన్‌ – ఆదిత్య స్కూల్స్‌, పిఠాపురం సంయుక్తంగా కవిత, కథా సంపుటాల పోటీని నిర్వహిస్తున్నాయి. ఎంపికైన కథా సంపుటికి రూ. 5 వేలు, కవితా సంపుటికి రూ. 5 వేలు బహుమతి ఉంటుంది. జనవరి 2023 – ఆగస్టు 2025 మధ్య ప్రచురితమైన కవిత, కథ సంపుటాలు మూడు కాపీలను సెప్టెంబర్‌ 5 లోగా చిరునామా: ఆదిత్య స్కూల్‌, సీతయ్య గారి తోట, పిఠాపురం – 533450కు పంపాలి. వివరాలకు ఫోన్‌: 94945 53425.

ర్యాలి ప్రసాద్‌

‘హాసిని రామచంద్ర’ అవార్డులు

హాసిని రామచంద్ర లిటరరీ ఫౌండేషన్ 2025 అవార్డులకు ఎంపికైన కథా సంపుటాలు: మొదటి బహుమతి– జక్కదొన (ఆర్.సి.కృష్ణ స్వామి రాజు); రెండవ బహుమతి– నల్లబంగారం కథలు (స్వర్ణ కిలారి); మూడవ బహుమతి– విజయ మహల్ సెంటర్ (రోహిణి వంజరి). ఎంపికై కవిత్వ సంపుటాలు: మొదటి బహుమతి– నల్ల పద్యం (పిన్నంశెట్టి కిషన్); రెండవ బహుమతి– దాపల (కోసూరి రవి కుమార్); మూడవ బహుమతి – రవిక (రేణుక అయోలా). హాసిని రామచంద్ర లిటరరీ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని అబ్దుల్ రజాహుస్సేన్ స్వీకరిస్తారు. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం ఆగష్టు 17న ఖమ్మంలో జరుగుతుంది. వివరాలకు: 95028 18774.

సుభాషిణి తోట

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 01:17 AM