ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Coalition Driving Andhras Growth: అభివృద్ధి రథానికి కూటమి సారథ్యం

ABN, Publish Date - Sep 19 , 2025 | 01:31 AM

సమర్థవంతమైన సారథ్యమే విజయాన్ని తెచ్చిపెడుతుంది. నరేంద్రమోదీ సారథ్యం దేశానికి ఎన్నో అపురూప విజయాలను తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కూటమి పార్టీల సారథ్యంలో సమష్టి కృషితో అభివృద్ధి, జవాబుదారీతనం రాష్ట్రానికి మంచి భవిష్యత్‌ను...

సమర్థవంతమైన సారథ్యమే విజయాన్ని తెచ్చిపెడుతుంది. నరేంద్రమోదీ సారథ్యం దేశానికి ఎన్నో అపురూప విజయాలను తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కూటమి పార్టీల సారథ్యంలో సమష్టి కృషితో అభివృద్ధి, జవాబుదారీతనం రాష్ట్రానికి మంచి భవిష్యత్‌ను కల్పిస్తున్నాయి. సమర్థులంతా తమ తమ విభాగాల్లో సారథ్యం వహిస్తున్నందున ఇవాళ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్టాలెక్కింది.

ఎన్డీయే కూటమి కలసికట్టుగా దేశ ప్రగతిని సాధిస్తూ ప్రజలు కోరుకున్న పాలన అందిస్తోంది. దాని ఫలితమే నేడు అనేక రకాలుగా పన్నుల విషయంలో అంతర్జాతీయ ఒత్తిడులు ఉన్నా, మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో, అభివృద్ధి–సంక్షేమం సాధించడంలో ఎన్డీయే కూటమి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోంది. ఏపీ వృద్ధి రేటు 10.5 శాతానికి చేరుకోవడం అభినందనీయం. దీనిని ఎన్డీయే కూటమి ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధికి చక్కటి సంకేతంగా భావించవచ్చు. అందుకే భారతీయ జనతా పార్టీ ‘సారథ్యం’ పేరుతో కేంద్ర ప్రభుత్వం విజయాలను, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ మంచి పనులను నేడు ప్రజలలోకి తీసుకెళ్లింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే వివిధ దశల్లో 26 జిల్లాలలో ‘సారథ్యం’ పేరుతో నేరుగా ప్రజలను, పార్టీ శ్రేణులను కలిసి ఈ యాత్రను దిగ్విజయంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సాగిస్తున్న పురోగతిని, కేంద్రం అందిస్తున్న సహకారాన్ని, రాష్ట్రంలో ఎన్డీయే సాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను ప్రజలకు తెలియచేసేలా ఈ యాత్ర విజయవంతంగా జరిగింది. ఈ యాత్రలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. మెరుగైన పాలనకు వారి అభిప్రాయాలను, సూచనలను తీసుకున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమైన ఈ యాత్ర 14న విశాఖపట్నంలో ముగిసింది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు సెమీకండక్టర్ యూనిట్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పరిశ్రమ రాబోయే రోజుల్లో అత్యంత కీలకం. ఒక పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఏర్పాటయితే, ప్రైవేటు రంగంలోనూ పెట్టుబడులు వస్తాయి. అందుకే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కేటాయింపుపై విస్తృత ప్రచారం జరిగింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ డబుల్ ఇంజిన్ సర్కార్ సారథ్యంలో చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమం వెనుక కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రత్యక్ష సహకారం ఉంది. అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక కారిడార్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వంటి వాటిలో నిధుల కొరత లేదు. సారథ్యం యాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా అదే.

అమరావతి, పోలవరం– ఈ రెండింటిలోనూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కారులో పనులు వేగంగా జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో ఆగిపోయిన అనేక ప్రాజెక్టులు గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చిన ప్రతి ప్రతిపాదననూ కేంద్రం ఆమోదించింది. మొదటగా 2024–25 యూనియన్ బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధి కోసం రూ.15,000 కోట్లు కేటాయించారు. ఈ నిధులు వరల్డ్ బ్యాంక్, ADB వంటి సంస్థల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మొదటి విడతలో రూ.4,285 కోట్లు విడుదల చేశారు, ఇది 25 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా వరల్డ్ బ్యాంక్ ద్వారా ఏప్రిల్ 1, 2025న వచ్చింది. ఇవన్నీ కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది. రాష్ట్రానికి ఆర్థిక భారం లేదు. మే 2, 2025న ప్రధాని మోదీ అమరావతిలో రూ.58,000 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు 2024–25 కేంద్ర బడ్జెట్‌లో రూ.50,475 కోట్లు కేటాయించారు. ఇందులో అమరావతి, జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాలు, విద్యారంగం సహా ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు పలు శాఖలలో పనులు జరుగుతున్నాయి. ఇది కూటమి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు గందరగోళంలో పడింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కోసం 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.12,157 కోట్లను రెండు విడతలలో కేటాయించింది, వీటితో ప్రాజెక్టు నిర్మాణం ఊపందుకుంది. 2014 నుంచి 2025 వరకు, కేంద్రం రూ.13,226.04 కోట్లను ప్రాజెక్ట్ కోసం విడుదల చేసింది. 2025 ఫిబ్రవరి నాటికి ప్రాజెక్ట్ 55.9శాతం పూర్తయింది. 2019–2024 మధ్య వైసీపీ ప్రభుత్వం సంవత్సరానికి 2.32శాతం పురోగతి సాధించగా, ఎన్డీయే ప్రభుత్వం 2024 జూన్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు 8 నెలల్లో 6.11శాతం పురోగతిని సాధించింది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమ రావడం ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్. భోగాపురం ఎయిర్‌పోర్టు శరవేగంగా పూర్తవుతోంది. రాయలసీమ ప్రాంతంలోని కొప్పర్తి నోడ్, ఓర్వకల్ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి రూ.4,000 కోట్ల నిధులు కేంద్రం కేటాయించింది. ఈ కారిడార్లు ఇండస్ట్రియల్ గ్రోత్‌ను ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఉన్నాయి. రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలలో సామాజిక–ఆర్థిక అభివృద్ధి కోసం రూ.4,000 కోట్లు కేటాయించారు. ఇందులో రోడ్లు, నీటి సరఫరా, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు ఉన్నాయి. సోలార్, విండ్, ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇది ప్రోత్సాహం ఇస్తుంది. ఏపీలో 1,336 కి.మీ. కొత్త, అదనపు రైల్వే లైన్ల కోసం డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. విశాఖ రైల్వేజోన్ కూడా ప్రారంభానికి సిద్ధమవుతోంది.

రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు గమ్యం లేని పాలన సాగింది. అలాంటి స్థితి నుంచి రాష్ట్రాన్ని వృద్ధి బాటలోకి నడిపించడం.. నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సారథ్యం వల్లనే సాధ్యమవుతుందని ప్రజలు గట్టిగా నమ్మి, వారికి పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని సాధ్యం చేయడానికి నేడు కూటమి పార్టీలు పని చేస్తున్నాయి. మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తోంది. చంద్రబాబునాయుడు, సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పవన్‌ కల్యాణ్ సహకారంతో ఆంధ్రను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నది. ‘సారథ్యం’ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరై ఇవే విషయాలను గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మెప్పించడానికే సారథ్యం చేయాలి. అలాంటి నాయకత్వం ప్రజలకు వచ్చినప్పుడు వారు ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించరు. ప్రధాని మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని, ఆంధ్రకు కొత్త వందేభారత్ రైళ్లు అందించామని, విమానాశ్రయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని నడ్డా తెలిపారు. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరేలా సాగిన ఈ ‘సారథ్యం’ యాత్ర లక్ష్యాన్ని చేరింది. ఏపీలో బీజేపీతో పాటు కూటమిని మరింత బలోపేతం చేసింది. గ్రామగ్రామానికి కూటమి విజయాలు చేరేలా చేసింది.

ఎస్. విష్ణువర్ధన్‌రెడ్డి

బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 01:32 AM