ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సర్కార్‌ బడులకు పూర్వ వైభవం తేవాలి

ABN, Publish Date - Jun 19 , 2025 | 04:25 AM

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు వేలాది మంది పిల్లలతో కళకళలాడేవి. ఊళ్లలో చదువుకోవడానికి పిల్లలకు సర్కారు బడులే ఉండేవి. పెద్దపెద్ద పట్టణాలలో మాత్రమే ఒకటి, రెండు ప్రైవేటు స్కూళ్లు ఉండేవి. అయినా ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే...

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు వేలాది మంది పిల్లలతో కళకళలాడేవి. ఊళ్లలో చదువుకోవడానికి పిల్లలకు సర్కారు బడులే ఉండేవి. పెద్దపెద్ద పట్టణాలలో మాత్రమే ఒకటి, రెండు ప్రైవేటు స్కూళ్లు ఉండేవి. అయినా ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేవారు. ధనవంతులు, పేదలు అన్న తేడా లేకుండా ఒక కుటుంబంలా అందరూ ఒకే దగ్గర విద్యనభ్యసించేవారు. ఇప్పుడు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు.. ఉన్నతోద్యోగాలు చేస్తున్నవారిలో ఎక్కువ మంది సర్కారు బడుల్లో చదివినవారే. వ్యాపారాల్లోనూ దిగ్గజాలుగా ఎదిగి స్థిరపడినవారెందరో సర్కారు బడుల్లో చదివినవారే. అలాంటి సర్కారు బడులకు మళ్లీ పూర్వ వైభవం రావాలి. అది జరగాలంటే ప్రజలే చైతన్యవంతులు కావాలి. ఇటీవల కొంతమంది ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులుండగా, మూడు రోజుల్లోనే ఆ సంఖ్య 130కి చేరింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎస్‌కే సయ్యద్‌ తన కూతురును, వీఆర్‌ఏగా పనిచేస్తున్న పెసర మహేష్‌ తన కుమారుడిని, నవోదయ పాఠశాలలో గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న పెద్దారపు సంపత్‌ తన కూతురును ప్రభుత్వ బడులలో చేర్పించారు.

అలాగే సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన సీపీఐ నాయకుడు అందె అశోక్‌ తన కుమారుడిని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. గ్రామ, మండల స్థాయిలలోని అధికారులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన పక్షంలో స్థానికులకు స్ఫూర్తి కలుగుతుంది. సర్కారు బడులకు పూర్వ వైభవం తెచ్చేలా ఉపాధ్యాయులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే, మార్పు తప్పకుండా వస్తుంది.

గడ్డమీది శ్రీనివాస్‌

ఈ వార్తలు కూడా చదవండి..

హీరో ఫిన్‌కార్ప్‌ రూ 260 కోట్ల సమీకరణ

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 04:53 AM