ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జీపీ కార్మికులను క్రమబద్ధీకరించాలి

ABN, Publish Date - Jun 13 , 2025 | 05:54 AM

గ్రామ పంచాయతీ కార్మికులు తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణతో పాటు అనేక విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు తక్కువ ఆదాయంతో, ఉద్యోగ భద్రత లేకుండా కుటుంబాలను...

గ్రామ పంచాయతీ కార్మికులు తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణతో పాటు అనేక విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు తక్కువ ఆదాయంతో, ఉద్యోగ భద్రత లేకుండా కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వీరికి సంబంధించి గతంలో పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవో నెం.57లో పలు అంశాలున్నాయి. గ్రామ పంచాయతీ కార్మికులను ఫుల్‌టైం, మల్టీపర్పస్ ఉద్యోగులుగా గుర్తించాలని, వారి వేతనాలను కనీసం పదివేలకు పెంచాలని, గ్రామ ఆదాయంలో సగం వరకు వేతన వ్యయంగా వెచ్చించవచ్చని జీవోలో స్పష్టంగా ఉంది. ఈ అంశాలు అమలుకాకపోవడంతో జీపీ కార్మికులు నిరాశ చెందుతున్నారు. MGNREGA పథకంలో అమలవుతున్న విధంగా జీపీ కార్మికుల వేతనాలు కూడా ‘డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్’ పద్ధతిలో చెల్లించాలి. 2023లో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఒప్పంద ఉద్యోగుల సేవల నియమితీకరణ చట్టం’ ప్రకారం 2014 జూన్ 2 నాటికి ఉద్యోగంలో కొనసాగుతున్న ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించే వీలుంది. ఇదే నిబంధన జీపీ కార్మికులకూ వర్తింపజేయాలి. వీరిలో చాలామంది 45 ఏళ్లకు పైబడినవారు. ఇతర ఉపాధి అవకాశాలు పొందలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం జీపీలను ఆదాయం, జనాభా ప్రాతిపదికన నాలుగు గ్రేడ్లుగా రూపొందించాలన్న యోచనలో ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ సిబ్బందిని ఆయా పోస్టుల్లో సర్దుబాటు చేస్తే పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.

టి.యం.బి. బుచ్చిరాజు

చైర్మన్, ఏపీ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్

ఈ వార్తలు కూడా చదవండి..

కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..

లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 05:54 AM