ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Siddhartha: పుప్పాలగూడా రాళ్ళపందిరి

ABN, Publish Date - May 26 , 2025 | 05:09 AM

పాతకాలపు గుర్తులు, ఒంటరితనపు అనుభూతులు, గ్రామ జీవితం మరియు ప్రకృతితో స్నేహానికి సంబంధించిన మధురమైన చిత్రణ. మనసు లోపలి ఆవిర్భావాలను, సమయంతో జతకలిసి వచ్చిన భావోద్వేగాలను వివరించేది.

ఈ ఈనె గుండ్లన్నీ పాత పాతవే

పాకురెక్కిన రాత్రుల వలెనే ఏడు సముద్రాల

చిటికెన వేలును పట్టుకొని నడిచే పాత రోజులు

వాటి నుదుర గీతలు

కూరగాయల సంచుల కండ్లు వేలాడుతూ..

తిరిగే వొంటరితనాలు మనిషొక్కడే అనేకానేక వేలఏండ్ల గాలి...


దరి కాన రాని

భూమి లోపలి జీవి పుదీనా,

సుక్కకూరల సోయిగూరల

ఆరిపోని వాసన వాళ్ళ కొంగులు.. తగిలి

నడిచిపోతుంటే


కడియాల చూపులు,

ఆమె విడిచిపోతుంటే

గడియ వేయని తలుపులు సగమే తెరిచే..

పాత తొవ్వలు గవ్వల మాలలై ముడిచిన బండారు పూతలు,

ముడుచుకొని నవ్వే వెదురు గుంజలూ...


పూర్తిగా పగలని ముంజలూ

పాత పాత గుడిరాళ్ళు

పడావు పడిన కొత్త చీకట్ల

ఎందరెందరో పతంగిలను


ఎగరేసుకుంటు...

రాత్రిపూట వెలిగే టప్కీపున్నమి

కర్జూరపండు చంద్రుడు దఖ్కనీ..

నా దఖ్కనీ... వెన్నెల... నేనూ

నా బస్తీ పోరగాండ్లూ పోరీలూ

అనేకం మందిమి పుప్పాలగూడ తొవ్వపొంట

- సిద్ధార్థ

73306 21563

Updated Date - May 26 , 2025 | 05:09 AM