ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కరాచీ బేకరీపై రచ్చ సబబు కాదు

ABN, Publish Date - May 14 , 2025 | 06:29 AM

జాతీయ భావోద్వేగం అనే సున్నిత అంశంతో రాజకీయాలు జోరుగా జరుగుతున్న రోజులివి. దేశభక్తి ప్రామాణికతను నిర్ధారించడం కష్టమవుతున్న నేపథ్యంలో జన్మభూమి, కర్మభూమి లేదా పుణ్య భూమిల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం అంత సులువు కాదు. కరాచీ బేకరీ... భారతీయ ధర్మం గురించి సరైన అవగాహనలేని అజ్ఞానుల ఆగ్రహావేశాలకు గత కొంత కొన్నాళ్ళుగా...

జాతీయ భావోద్వేగం అనే సున్నిత అంశంతో రాజకీయాలు జోరుగా జరుగుతున్న రోజులివి. దేశభక్తి ప్రామాణికతను నిర్ధారించడం కష్టమవుతున్న నేపథ్యంలో జన్మభూమి, కర్మభూమి లేదా పుణ్య భూమిల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం అంత సులువు కాదు. కరాచీ బేకరీ... భారతీయ ధర్మం గురించి సరైన అవగాహనలేని అజ్ఞానుల ఆగ్రహావేశాలకు గత కొంత కొన్నాళ్ళుగా గురవుతున్న ఒక ప్రఖ్యాత వాణిజ్య సంస్ధ. తమ జన్మ స్ధలం గురించి అందరిలోనూ ఒక రకమైన ప్రేమాభిమానం ఉంటుంది. అందునా సింధీలు, పంజాబీలకు ఇది కాస్త ఎక్కువ. దేశ విభజన సందర్భంగా తమ జన్మస్ధలాలను వదిలి శరణార్ధులుగా వచ్చిన సింధీలు తమ మూలాలను ఏ మాత్రం మరిచిపోలేదు. కొందరు తమ వ్యాపారాలకు లేదా గృహాలకు, విడిచి వచ్చిన జన్మ స్ధలాల పేరిట నామకరణం చేసుకున్నారు. అత్యధికులు అదే మూలల వారితో మాత్రమే మమేకం కావడానికి సహజంగా ఇష్టపడతారు, అయినా వీరందరు సంపూర్ణ భారతీయులు. వారి దేశ భక్తిని ఏ మాత్రం శంకించడానికి వీలు లేదు. ఈ రకంగా పాకిస్థాన్ నుంచి తెలుగునాటకు వచ్చిన అనేక మంది హిందూ శరణార్థలలో ఘన్చంధ్ రమ్ననీ ఒకరు, తన కన్న ఊరు కరాచీ పేరిట ఆయన భారత స్వాతంత్ర్యం తొలినాళ్ళలో నెలకొల్పిన బేకరీ ప్రస్తుతం ఆ రంగంలో అగ్రగామి. ఇప్పటి వరకు జరిగిన సరిహద్దు యుద్ధాలలో గానీ హైదరాబాద్ నగరంలో సంభవించిన మతకలహాలలో గానీ కరాచీ బేకరీ వైపు ఎవరు ఎప్పుడూ కన్నెత్తి చూడలేదు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు లేని కాలంలో అది సురక్షితంగా ఉన్నది. ఆ నవీన సాంకేతికతల పుణ్యమా అంటూ సమస్తమూ బహ్గితమవుతోన్న ప్రస్తుత కాలంలో తరచు దేశభక్తి పేర అలజడి సృష్టించే అల్లరిమూకల అగ్రహానికి గురవుతోంది. హైదరాబాద్‌లోని కరాచీ బేకరీయే కాదు, విశాఖపట్టణం సిరిపురంలోని కరాచీవాలా స్టోర్స్, విజయవాడ కొత్తపేటలో కరాచీ స్టోర్స్, కరీంనగర్‌లోని హైద్రాబాద్ సింధ్ క్లాత్ స్టోర్స్ మొదలైన అనేక సంస్ధలకు శరణార్థులుగా వచ్చిన సింధీలు తాము జన్మించిన నగరాల పేర్లు పెట్టుకున్నారు. ఇదే విధంగా, కరాచీ నగరంలో కొన్ని హోటళ్ళు, వ్యాపార సంస్ధలకు బొంబాయి పేరు ఉంది. దేశ విభజనలో హైదరాబాద్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్ళిన ముస్లింలు తమ జన్మస్ధలం పేరిట కరాచీ నగరంలో ఏకంగా హైదరాబాద్ కాలనీ నెలకొల్పుకున్నారు. బీజేపీ కురువృద్ధుడు లాల్‌కృష్ణ ఆడ్వాణీ 2005లో తన పాక్‌ పర్యటన సందర్భంగా తన జన్మస్ధలానికి వెళ్ళి తాను బాల్యం గడిపిన ఇంటిని చూసి కన్నీరు పెట్టున్నారు. అంతమాత్రాన ఆయన దేశభక్తిని శంకిస్తారా? పాకిస్థాన్‌ ప్రధాని షహేబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల కుటుంబాలు లాహోర్‌లో నివాసముండే సువిశాల భవంతి పేరు జతి ఉమ్ర ప్యాలెస్.


1700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవంతి. ఒక్క పాకిస్థాన్‌లోనే కాదు ఆసియా ఖండంలోనే సువిశాల నివాస గృహమని చెప్పవచ్చు. భారత పంజాబ్‌లోని తరణ్ తరణ్ జిల్లాలో ఉన్న ఒక కుగ్రామం పేరు జతి ఉమ్ర. ఈ గ్రామంలోనే నవాజ్ షరీఫ్ తండ్రి జన్మించారు. తాను పుట్టిన ఊరిపై మమకారంతో లాహోర్‌లో సొంత గృహానికి భారత్‌లో ఉన్న గ్రామం పేరు పెట్టుకున్నారు. గల్ఫ్ దేశాలలో ఉన్న తమ కుటుంబ ఉక్కు పరిశ్రమలలో భారత్‌లోని తమ పూర్వీకుల గ్రామానికి చెందిన అనేక మంది సిక్కు యువకులకు షరీఫ్ కుటుంబం ఉద్యోగాలు కూడ ఇచ్చింది. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ప్రసిద్ధిగాంచిన లింగాపూర్ హజ్ కూడా ఒక జన్మస్ధలంపై ఉన్న అభిమానానికి ఒక నిదర్శనం. జగిత్యాల జిల్లా బండలింగాపూర్ గ్రామానికి చెందిన రాజ అనంత కిషన్‌రావు కుమారులు గజసింహారావు, రాజనర్సింహారావు తమ కన్న ఊరు పేరిట హైదరాబాద్ నగరం నడిబొడ్డున అప్పట్లో నిర్మించిన వాణిజ్య సముదాయానికి లింగాపూర్‌గా నామకరణం చేసారు. ఒకనాటి భారతీయ జన సంఘ్ అగ్రనాయకులలో పలువురు అవిభక్త భారతంలో నేటి పాకిస్థాన్‌గా ఉన్న ప్రాంతాల పేర్లతో పరస్పరం పిలుచుకునేవారు. భారత్‌లోని గ్రామం పేరుతో ఉన్న భవంతిలో నివసిస్తున్న పాకిస్థాన్ ప్రధానమంత్రికి స్వీయ దేశాభిమానం కొరవడిందా? కరాచీ బేకరీ పేర వ్యాపారం చేస్తున్న యాజమానుల దేశభక్తి ఏమైనా తగ్గిందా? లింగాపూర్ హౌజ్, కరాచీ బేకరి లేదా జతి ఉమ్ర ఏదైనా సంబంధిత వ్యక్తుల మనస్సుతో ముడివడి ఉన్న ఒక భావోద్వేగ అనుబంధం. ఇటువంటి సున్నిత అంశంపై రచ్చ చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 06:29 AM