ఫ్లోరోసిస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
ABN, Publish Date - Jun 26 , 2025 | 04:53 AM
నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ రక్కసి ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది. మర్రిగూడ, నార్కెట్‌పల్లి, గట్టుప్పల్, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, నాంపల్లి తదితర మండలాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం తీవ్రంగా...
నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ రక్కసి ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది. మర్రిగూడ, నార్కెట్‌పల్లి, గట్టుప్పల్, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, నాంపల్లి తదితర మండలాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఈ వ్యాధికి గురయినవారు వైద్యం కోసం లక్షల రూపాయలు వెచ్చించే స్తోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతూ గత బీఆర్‌ఎస్ హయాంలో ఎన్ని వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదు. ఫ్లోరోసిస్ బాధితుల సంక్షేమం కోసం ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం శోచనీయం. తమకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా చర్యలు తీసుకుని, ప్రత్యేక జీవో విడుదల చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ఫ్లోరోసిస్ బాధితులు గతంలో వినతిపత్రం అందజేశారు. కానీ ఇంతవరకూ దానిపై ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరం. ఇప్పటికైనా ఈ సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి. సహజ న్యాయ సూత్రాలు, మానవతా దృక్పథాన్ని అనుసరించైనా వెంటనే నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశం జరిపి, ఫ్లోరోసిస్ బాధితులకు ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ఆదేశాలు జారీ చేయాలి.
పల్లె వినయ్‌కుమార్,
నల్లగొండ
ఇవి కూడా చదవండి..
కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 26 , 2025 | 04:53 AM