Pak Major Moiz: కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:33 AM
భారత పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి మరో వార్త వచ్చేసింది. దక్షిణ వజీరిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థ TTP జరిపిన దాడిలో, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కీలక అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (Pak Major Moiz) మృతి చెందారు. 2019లో బాలకోట్ ఎయిర్‌స్ట్రైక్ తర్వాత భారత వాయుసేన అధికారి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను బంధించిన అధికారి మోయిజ్ (Major Moiz Abbas Shah) కావడం విశేషం.
పాకిస్థాన్ నుంచి కీలక వార్త వెలుగులోకి వచ్చింది. దక్షిణ వజీరిస్తాన్‌లోని సర్గోధాలో TTP (తెహ్రిక్-ఇ తాలిబన్ పాకిస్థాన్) జరిపిన దాడిలో మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (Major Moiz Abbas Shah) అనే అధికారి మరణించారు. 2019లో బాలకోట్ దాడిలో భారత వైమానిక దళ అధికారి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను బంధించిన అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ షా. పాకిస్థాన్ సైన్యం ప్రకారం, TTP దాడిలో మేజర్ మోయిజ్ అబ్బాస్ షా, లాన్స్ నాయక్ కూడా మరణించారు. ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలో నిఘా ఆధారిత ఆపరేషన్‌లో ఈ ఇద్దరు సైనికులు మరణించారని పాకిస్థాన్ మీడియా విభాగం తెలిపింది.
దక్షిణ వజీరిస్తాన్‌లో నిఘా ఆధారిత ఆపరేషన్‌లో ఈ దాడి జరిగింది. ఈ ఆపరేషన్‌లో TTP ఉగ్రవాదులు, పాకిస్థాన్ సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మేజర్ మోయిజ్ అబ్బాస్ షా, లాన్స్ నాయక్ జిబ్రాన్ మరణించారు. పాకిస్థాన్ సైన్యం కొంతమంది TTP ఉగ్రవాదులను కూడా చంపినట్లు తెలిపింది.
అభినందన్ సంఘటన..
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాదులు 2019 ఫిబ్రవరిలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలకోట్‌లో జైష్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అయితే ఆ మరుసటి రోజు యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో.. అభినందన్ వర్ధమాన్ పారాచూట్ సాయంతో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో దిగాడు. ఆ తర్వాత అతన్ని పాకిస్థాన్ సైన్యం కస్టడీలోకి తీసుకుంది. ఈ సంఘటనలో మేజర్ మోయిజ్ అబ్బాస్ షా కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇవీ చదవండి:
జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి