ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూమి నవ్వడం చూసాను

ABN, Publish Date - Mar 17 , 2025 | 12:16 AM

మా తాత పంచె కట్టినప్పుడు నాగలికి ఎడ్లను కట్టేటప్పుడు భూమి నవ్వడం చూశాను...

మా తాత పంచె కట్టినప్పుడు

నాగలికి ఎడ్లను కట్టేటప్పుడు

భూమి నవ్వడం చూశాను...

మన్ను దున్నేటప్పుడు

నాట్లు వేసేటప్పుడు

నీళ్ళు పెట్టేటప్పుడు

మా తాత కాళ్ళకు భూమి దణ్ణం పెట్టడం చూశాను...

పసిపిల్లగా పంటను సాకేటప్పుడు

పురుగుమందును జల్లేటప్పుడు

కాకులకు వడిశెల వేసేటప్పుడు

కన్నకూతురిగా మారిన భూమి తాత చేతుల్ని ముద్దాడ్డం చూశాను..

పొలాన్ని బీడుగా చేసి... గజానికో రేటు కట్టి..

వట్టిపోయిన పొలమంటూ పదికో పరక్కో అమ్మినప్పుడూ...

భూమి నవ్వడం చూశాను...

ఆ నవ్వుపై కలుపుమొక్కల్లా లేచిన అపార్టుమెంట్ల

నీలినీడలు కమ్మినప్పుడు

వాటాలేసి, వంతులేసి.. పంచుకుని

తుంచుకుంటున్నప్పుడు

భూమి నవ్వడం చూశాను..

పొక్లెయిన్ ఇనుపచేతితో గుండె పిండైనప్పుడు

వేలవేల దిమ్మెసెలతో మొహంపై

మోడైనప్పుడు ఆఖరిగా భూమి నవ్వడం చూశాను..

ఆమె నవ్వును హత్య చేసిన నిందితులను

ప్రత్యక్షంగా చూశాను...

వాదించే జడ్జిలేదు ఉరితీసే తీర్పూలేదు...

చంపింది మనిషిని కాదుగా నేలను కదా..

చిట్టచివరిగా తెరలు తెరలుగా పొరలు పొరలుగా

ఓడిపోయిన భూమి పొడి నవ్వును చూశాను..

అమూల్య చందు

ఈ వార్తలు కూడా చదవండి:

Diamond Ring Robbery: టాలీవుడ్ హీరోకి షాక్ ఇచ్చిన దొంగలు..

Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత

Updated Date - Mar 17 , 2025 | 12:16 AM