A Poetic Reflection: మంచు కరుగుతున్నపుడు...
ABN, Publish Date - Jul 14 , 2025 | 12:37 AM
మేఘమల్హారానికి అశ్రువృష్టి ఇదో నిస్తంత్రీ సంవాదం
మేఘమల్హారానికి అశ్రువృష్టి
ఇదో నిస్తంత్రీ సంవాదం
చపల చెమరింతతో
ఉప్పు పట్టిన వాక్యమొకటి
ఉండుండి వీచే
వెక్కిళ్ళ, నిట్టూర్పుల గాలి
శీతల శ్యామవర్ణపు జర
దేహానికి కొత్తశత్రువు
సవరణల సంక్లిష్ట జీవితం,
వాకిలి అంచున బేలగా
-మల్లారెడ్డి మురళీమోహన్
88611 84899
Updated Date - Jul 14 , 2025 | 12:37 AM