ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

VIVIDHA: గజ్జెల మల్లారెడ్డి శతజయంతి సదస్సు

ABN, Publish Date - Dec 15 , 2025 | 03:47 AM

అభ్యుదయ రచయితల సంఘం, కర్నూలు ఆధ్వర్యంలో ‘90 ఏళ్ళ తెలుగు అభ్యుదయ సాహిత్యం’ సదస్సు డిసెంబరు 21 ఉ.10గం.లకు సలాం ఖాన్‌ ఎస్టియు....

సాహిత్య అకాడమీ

కడప యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గజ్జెల మల్లారెడ్డి శతజయంతి సదస్సు డిసెంబరు 19 ఉ.10.30ని.లకు మొల్ల సమావేశ మందిరం, ఆర్ట్స్‌ బిల్డింగ్‌, యోగివేమన విశ్వవిద్యాలయం, కడపలో జరుగుతుంది. సభలో ఎం.ఎం. వినోదిని, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, రాజశేఖర్‌ బెల్లంకొండ, టి. శ్రీనివాస్‌, జి. పార్వతి తదితరులు పాల్గొంటారు.

సాహిత్య అకాడమీ

  • 90ఏళ్ళ అభ్యుదయ సాహిత్యం

అభ్యుదయ రచయితల సంఘం, కర్నూలు ఆధ్వర్యంలో ‘90 ఏళ్ళ తెలుగు అభ్యుదయ సాహిత్యం’ సదస్సు డిసెంబరు 21 ఉ.10గం.లకు సలాం ఖాన్‌ ఎస్టియు భవన్‌, ఉర్దూ పాఠశాల పక్కన, కర్నూలులో జరుగుతుంది. సభలో నవీన్‌ కుమార్‌, వల్లూరు శివప్రసాద్‌, కె. ప్రహ్లాద్‌, పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొంటారు.

సాహిత్య అకాడమీ

  • ఎదిరెపల్లి మశమ్మ స్మారక పురస్కారం

ఎదిరెపల్లి మశమ్మ స్మారక జాతీయ పురస్కారానికి సంగిశెట్టి శ్రీనివాస్ ఎంపికయ్యారు. పురస్కార ప్రదానం డిసెంబరు 21 ఉ.10గం.లకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సింగిల్ విండో హాల్‌లో జరుగుతుంది. పురస్కారం కింద రూ.20వేల నగదును, జ్ఞాపికను ఇస్తారు. సభలో గోరటి వెంకన్న, సుంకిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొంటారు.

ఎదిరెపల్లి కాశన్న

  • యువ పురస్కారం

ఈశ్వర వరప్రసాద పరిషత్తు, గుంటూరు అందిస్తున్న యువ పురస్కారాన్ని ‘ద్రావిడ మహాసముద్రం’ కవితా సంపుటికి గూండ్ల వెంకటనారాయణ స్వీకరిస్తారు. పురస్కార ప్రదానం డిసెంబరు 21 ఉ.10గం.లకు కొరటాల మీటింగ్‌ హాల్‌, 2/7 బ్రాడీపేట, గుంటూరులో జరుగుతుంది. కె.జె.రమేష్‌, భూసురపల్లి వెంకటేశ్వర్లు, శెట్లం చంద్రమోహన్‌ తదితరులు పాల్గొంటారు.

ఎస్‌.యం. సుభాని

  • రవ్వా శ్రీహరి సాహితీ పురస్కారం

ఆచార్య రవ్వా శ్రీహరి స్మారక సాహితీ పు రస్కారాన్ని మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కలిమిశ్రీ స్వీకరిస్తారు. అవార్డు ప్రదానం డిసెంబరు 21న విజయవాడలో జరుగుతుంది.

తుమ్మ సత్యనారాయణ

  • ‘ఒక ఆకుపచ్చకల’ కవిత్వ సంపుటి

కాసుల లింగారెడ్డి కవిత్వ సంపుటి ‘ఒక ఆకుపచ్చకల’ ఆవిష్కరణ డిసెంబరు 23 సా.8గం.లకు హైదరాబాద్ బుక్‌ఫెయిర్, తెలంగాణ కళాభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో కాసుల ప్రతాప్‌రెడ్డి, కె. శ్రీనివాస్, విమల మోర్తల, వి.ఆర్. తుమలూరి పాల్గొంటారు.

శ్రీధర్ గాజుల

Updated Date - Dec 15 , 2025 | 03:47 AM