ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BC Empowerment: బీసీల మూగగోసకు నేనిచ్చిన గొంతు బహుజనగణమన

ABN, Publish Date - Aug 11 , 2025 | 01:29 AM

జూలూరు గౌరీ శంకర్ కవి, ఉద్యమకారుడు. ఆయన దీర్ఘకవిత ‘పాదముద్ర’ అస్తిత్వ సాహిత్యోద్యమ కాలంలో ఒక మైలురాయి. ఆయన సంపాదకత్వం వహించిన ‘వెంటాడే కలాలు వెనుకబడ్డ కులాలు’ ఒక సంచలనం...

జూలూరు గౌరీ శంకర్ కవి, ఉద్యమకారుడు. ఆయన దీర్ఘకవిత ‘పాదముద్ర’ అస్తిత్వ సాహిత్యోద్యమ కాలంలో ఒక మైలురాయి. ఆయన సంపాదకత్వం వహించిన ‘వెంటాడే కలాలు వెనుకబడ్డ కులాలు’ ఒక సంచలనం. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన జూలూరు అనేక దీర్ఘ కవితలు రాసారు. ఇప్పుడు ఆయన తాజాగా 231 పేజీల సుదీర్ఘ కవిత ‘బహుజనగణమన’ వెలువరించారు. ఇది దేశవ్యాప్త బీసీల స్వరం అంటున్న ఆయనతో చిన్న ముఖాముఖం.

‘పాదముద్ర’ దీర్ఘకవిత నాటి దళితవాదం ‘బహుజనగణ మన’ నాటికల్లా బహుజనవాదం అయింది ఎందుకు?

‘పాదముద్ర’ నాటి దళితవాదం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరి సామూహిక స్వరం. అది చిక్కనవుతున్న పాటయి, పదునెక్కిన పాటయి, దేశీయ మార్క్సిజం అయింది. ఎవరి మూలాలు వాళ్ళే రాయాలన్న సిద్ధాంతం తలెత్తి అది ‘వెంటాడే కలాలు వెనుకబడ్డ కులాలు’ సంకలనం అయింది. ఆ నేపథ్యంలోనే ‘కొలిమి’, ‘నాలుగో కన్ను’ అని నేను రాసిన దీర్ఘకావ్యాలు రాజుకునీ రాజుకునీ ఇప్పుడు ‘బహుజనగణమన’ అయింది. ఇది మార్పు కాదు. ఇదొక సామాజిక చరిత్ర పరిణామక్రమం.

ఒక భావజాలవ్యాప్తికి దీర్ఘకవిత వాహిక కాగలదా?

బీసీల సామాజిక, ఆర్థిక న్యాయాల ఆవిష్కరణకు, ఆధిపత్య వర్గాల పెత్తనాన్ని వివిధ కోణాల్లో నిరసించడానికి దీర్ఘ కవిత మాత్రమే సరైన వాహిక అనుకున్నాను. అది 231 పేజీల దీర్ఘకావ్యం అయింది. తెలుగులో ఇంత పెద్ద దీర్ఘ కావ్యం మరొకటి లేదనే అనుకుంటున్నాను. బీసీ ఉద్యమానికి ఒక తాత్విక ఊతం ఇవ్వడానికి ప్రయత్నించాను. ‘బహుజనగణమన’ అంటే a poetic philosophical document on BC power.

‘వెంటాడే కలాలు వెనకబడ్డ కులాలు’లో చెప్పినదానికన్నా, ‘పొక్కిలి’లో చెప్పలేకపోయినదానికన్నా ‘బహుజనగణమన’లో అదనంగా కొత్తగా ఏదైనా చెప్పారా?

‘పొక్కిలి’ 129 మంది కవుల ప్రాంతీయ ఆకాంక్ష. ‘వెంటాడే కలాలు వెనకబడ్డ కులాలు’ 29 మంది కవుల స్వీయాత్మ. నా ‘బహుజనగణమన’ బీసీ రాజ్యాధికార రూట్ మ్యాప్. స్థానిక సంస్థలనుంచి పార్లమెంట్ దాకా రాజ్యాధికార అంశం ప్రధానంగా రాసిన మార్గదర్శి. దేశవ్యాప్త బీసీలు అడగలేకపోయిన మూగగోసకు నేనిచ్చిన గొంతు బహుజనగణమన.

మీరు కవి కాదు కేవలం ఉద్యమకారుడు అని అంటే మీ సమాధానం?

అవునా? కాళోజీనీ అదే అన్నారు కదా. నన్నూ అదే అంటున్నారా? అయితే గర్వపడాల్సిందే. నేను ఉద్యమ కవిని. కవిత్వం, ఉద్యమం మమేకమైన నేనొక దీర్ఘ కావ్యాన్ని. ఉద్యమ సందర్భంలో నా కవిత్వం వేదికకెక్కి, గోడలకెక్కి నినాదం అయింది. అది చాలు. అయినా ఉద్యమకారుడు కానివాడు కవి ఎట్లా అవుతాడు. వ్యక్తివాదం, విప్లవవాదం, భావవాదం, స్త్రీవాదం, ఆత్మాశ్రయవాదం ఏదో ఒక భావజాలాన్ని ఉద్యమంగా స్వీకరించనివాడు కవి యెట్లా. ప్రతి కవీ ఒక ఉద్యమకారుడే. అవును! నేను ఉద్యమకవినే!

ఇంటర్వ్యూ : ప్రసేన్

70133 58154

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 01:29 AM