Sadabainama Scheme: విలీన గ్రామాలకూ సాదాబైనామా వర్తింపజేయాలి
ABN, Publish Date - Nov 06 , 2025 | 05:08 AM
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్లాపూర్, అల్లీపూర్, నక్కలపల్లి, ధర్మారం సహా 42 పరిసర గ్రామాలను 2015లో నాటి ప్రభుత్వం వరంగల్ కార్పొరేషన్‌లో విలీనం చేసింది. భూమి పాస్‌బుక్‌లు లేని వారికి...
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్లాపూర్, అల్లీపూర్, నక్కలపల్లి, ధర్మారం సహా 42 పరిసర గ్రామాలను 2015లో నాటి ప్రభుత్వం వరంగల్ కార్పొరేషన్‌లో విలీనం చేసింది. భూమి పాస్‌బుక్‌లు లేని వారికి, సాదాబైనామాల ద్వారా భూ కొనుగోళ్లు చేసినవారికి ధరణి ద్వారా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తామని 2020లో నాటి ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ నలభైరెండు గ్రామాల్లోని వేల మంది రైతులు పట్టాదారు పాస్‌బుక్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని ఈ భూములకు సంబంధించిన విషయమై గతంలో కోర్టు స్టే విధించింది. దాంతో ఈ సాదాబైనామా కింద రైతులు చేసిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం కోర్టు స్టే ఎత్తివేసినప్పటికీ ‘కార్పొరేషన్ పరిధిలోని రైతుల భూములకు సాదాబైనామా వర్తించదు’ అని చెబుతూ ఇప్పుడు కూడా రైతుల దరఖాస్తులను రెవెన్యూ అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరంగల్ కార్పొరేషన్‌లో విలీనమైన 42 గ్రామాల్లోని వ్యవసాయ భూములకూ సాదాబైనామా వర్తింపజేయాలని, పట్టాదారు పాస్‌బుక్‌లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
బీరం రాములు
ఈ వార్తలు కూడా చదవండి:
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు
PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు
Updated Date - Nov 06 , 2025 | 05:08 AM