Wikipedia Internship: వికిపీడియా ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ABN, Publish Date - Oct 30 , 2025 | 12:50 AM
తెలుగు వికిపీడియా పురోగతికి, తెలుగు భాషలో నాణ్యమైన, విశ్వసనీయమైన జ్ఞానాన్ని ప్రపంచానికి ఉచితంగా అందించే లక్ష్యంతో, తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ (TWUG), ఐఐఐటీ–హైదరాబాద్‌లోని...
తెలుగు వికిపీడియా పురోగతికి, తెలుగు భాషలో నాణ్యమైన, విశ్వసనీయమైన జ్ఞానాన్ని ప్రపంచానికి ఉచితంగా అందించే లక్ష్యంతో, తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ (TWUG), ఐఐఐటీ–హైదరాబాద్‌లోని ఓపెన్ నాలెడ్జ్ ఇనిషియేటివ్స్ (OKI) బృందం సంయుక్త ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుగనున్నది. ఇందులో భాగంగా మూడు నెలల ఉచిత ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్, స్వచ్ఛంద కార్యకర్తల కార్యక్రమం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. 2025 నవంబర్ 14 నుంచి 2026 ఫిబ్రవరి 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజూ రాత్రి 7:00 నుంచి శిక్షణ తరగతులు జరుగుతాయి. ఇందులో పాల్గొనడానికి 18 నుంచి 30 సంవత్సరాల యువత అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గూగుల్ ఫారం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు తమ సీవీ (బయో–డేటా), ఒక ప్రేరణాత్మక వ్యాసం లేదా నమూనా రచనను జత చేయాలి. నిపుణుల ప్యానెల్ ద్వారా స్క్రీనింగ్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినవారికి (కనీసం 100 కొత్త వ్యాసాలు లేదా 200 ఇప్పటికే ఉన్న వ్యాసాలను మెరుగుపరచడం) ఓకేఐ, టీడబ్ల్యూయూజీ సంయుక్తంగా అధికారిక ప్రశంసాపత్రం అందజేస్తాయి. ఉద్యోగం చేస్తూ, ఇతర వృత్తులలో ఉంటూ లేదా పార్ట్‌టైమ్‌లో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలనే ఆసక్తి ఉన్నవారు, వయస్సుతో సంబంధం లేకుండా స్వచ్ఛంద కార్యకర్తలుగా చేరవచ్చు. వీరికి మూడు వారాల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు.
దరఖాస్తు ఫారం: https://forms.gle/3FfJ44o2gXMfEJz b8లో లభిస్తుంది. దరఖాస్తులు పంపడానికి నవంబర్ 10 ఆఖరు తేదీ.
మరిన్ని వివరాలకు వాట్సాప్: 9014120442;
Email: contact@tewikipedia.org
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్
ఇవి కూడా చదవండి:
Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..
Updated Date - Oct 30 , 2025 | 12:50 AM