ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడాదిలోనే ఎనలేని అభివృద్ధి

ABN, Publish Date - Jun 11 , 2025 | 06:11 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే లక్షల కోట్ల పెట్టుబడులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మరోవైపు సంక్షేమం కోసం వేల కోట్లు ఖర్చు...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే లక్షల కోట్ల పెట్టుబడులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మరోవైపు సంక్షేమం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అభివృద్ధికి అగ్రపీఠం వేసి కూటమి ప్రభుత్వం డబుల్‌ ఇంజన్‌ ఎనర్జీతో ముందుకెళ్తుంది. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు గ్రోత్‌ ఇంజిన్‌గా తీర్చిదిద్దనున్నారు. 2032 నాటికి 120 బిలియన్‌ డాలర్ల సంపదను ఈ రీజియన్‌ నుంచి సృష్టించాలనేది ముఖ్యమంత్రి చందబాబు నాయుడి లక్ష్యం. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి, మన్యం ఇలా మొత్తం 8 జిల్లాల పరిధిలో ఆర్థిక వ్యవహారాల్ని పెంచే పాజెక్టులు నెలకొల్పనున్నారు. వీటి అవసరాలకు ఇక్కడ లక్ష ఎకరాలు సేకరించనున్నారు. రాయలసీమలో ఎలక్ట్రానిక్‌ ఆటోమొబైల్‌, గ్రీన్‌ ఎనర్జీ పరిశ్రమల్ని నెలకొల్పుతున్నారు. బనకచర్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తలమానికంగా నిలవనుంది. చంద్రబాబు కార్యదీక్షతో 78 ప్రాజెక్టుల్లో రూ.9.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు. దీంతో 5.70 లక్షల ఉద్యోగావకాశాలు రానున్నాయి. అనకాపల్లి జిల్లాలో రూ.1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు, శ్రీసిటీలో రూ.5000 కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ, రూ.65వేల కోట్లతో రిలయెన్స్‌ కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్‌ తీసుకొచ్చారు. వీటితో మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోని ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. దీనిలో భాగంగా రూ.72వేల కోట్లతో హైవే ప్రాజెక్టులు, రూ.70వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులకు మంజూరు తీసుకొచ్చారు. 77 కిలోమీటర్ల మేర నిర్మించనున్న వైజాగ్‌ మెట్రో ప్రాజెక్టు 2028 – 30 నాటికి పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులను సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కలలు నెరవేరుస్తూ 6,100 పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసి పరీక్షలు నిర్వహించారు. 16,347 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ ప్రకటన విడుదల చేసి ఈ నెలాఖరికి మొత్తం పరీక్షలు పూర్తి చేయనున్నారు. ఇంకా రాష్ట్రంలో కొత్తగా కొన్ని విశ్వవిద్యాలయాలు నెలకొల్పనున్నారు. ఇవి కాకుండా ప్రపంచస్థాయి న్యాయ విశ్వవిద్యాలయం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ యూనివర్శిటీ, మరికొన్ని టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్లు తీసుకొస్తున్నారు.

ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తునే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నికల హామీలను ఏడాదిలో అరవై శాతానికి పైగా పూర్తి చేశారు. వృద్ధాప్యపు పింఛన్ల పెంచి, నెలకు 64 లక్షల మందికి ఈ ఏడాదిలో రూ.34 వేల కోట్లు పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55,57,525 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దీని కోసం పాత బకాయిలతో సహా రూ.15,258 కోట్లు చెల్లించింది. దీపం–2 పథకం కింద ఇప్పటికే కోటి సిలిండర్లు లబ్ధిదారులు ఇళ్ళకు చేర్చారు. దీనికి రూ. 2,684 కోట్లు ఖర్చు చేశారు. రహదారుల మరమ్మతులకు రూ.1200 కోట్లు ఖర్చు చేశారు. పంచాయితీల అభివృద్ధికి రూ.990 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్ళలో నిర్వహిస్తూ స్వర్ణాంధ్ర సాధన దిశగా దూసుకుపోతుంది.

దాసరి శ్యామ్‌చంద్రశేషు

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Read latest AP News And Telugu News

Updated Date - Jun 11 , 2025 | 06:11 AM