ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Generations of Darkness: తరాల చీకటి

ABN, Publish Date - Nov 10 , 2025 | 06:00 AM

A Powerful Telugu Poem by Pasunoori Ravinder

దేన్నైనా ఎంతకాలం భరిస్తవ్‌

ఎగరాలనుకునే ప్రతీసారి

నీ రెక్కలు కట్టేస్తున్న

తరాల చీకటి ఇది!

కళ్లముందే... పార్టులు పార్ట్‌లుగా

జీవితం ముగిసిపోతుంటుంది

చెరగని చిరునవ్వులతో...

రాలుతున్న పూలను చూసి

ఒంటరిగా దుఃఖిస్తుంటావు

మెరుపుల కలల్ని

నీలో సమాధి చేసుకుంటూ

ఒక సాహసయాత్రలో

నడుస్తుంటావు

రేపైనా గెలవకపోతానా అని

ప్రతీరోజూ ఓడిపోతుంటావు

మర్రిచెట్టులా నీడను పంచాలనుకుంటావు

మల్లెతీగవై పందిరిగుంజలమీదే

కాలాన్ని గడుపుతుంటావు

నెరవేరని ఆశల్ని

చలిమంటమీద కాల్చుకుంటూ...

తలుచుకొని తలుచుకొని

పొగిలి పొగిలి ఏడుస్తుంటావు

అడ్డంపడ్డ ఎద్దు కొమ్ము మీద కూర్చోని

కన్ను పొడుచుకు తింటున్నట్టు కాకి కాలం

నీ మానని గాయమై వెంటనడిచే నేస్తం

దుఃఖసంద్రాల మీద

ఒంటరి ప్రయాణీకుడివై

ఒడ్డును కలగంటుంటావు

చెరువుగట్టున చేపవై

చావుబతుకుల నడుమ

ఎదురీదుతుంటావు

గెలుపో... ఓటమో...

నీ కొట్లాటను చూసి

లోకం ఒక రిపోర్ట్‌ తయారుచేస్తుంది...

ఏదీ పట్టించుకోకు...

ఎక్కడా ఆగిపోకు...

నీకోసం ఉదయించే సూర్యోదయాలు

నీకోసం రెక్కలు చాచే సముద్రాలు

నీవైన కాలాలు తప్పక పుట్టకపోవు

రేపటిని నీకు

బహుమానంగా ప్రకటించకపోవు!

-పసునూరి రవీందర్‌

& 77026 48825

Updated Date - Nov 10 , 2025 | 06:00 AM