ఈ వారం ఆ రాశి వారికి పండగే పండగ..
ABN, Publish Date - Sep 28 , 2025 | 07:30 AM
ఈ వారం ఆ రాశి వారికి పండగే పండగ.. అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. శుభవార్త వింటారని, కొన్ని సంఘటనలు అనుకున్నట్టే జరుగుతాయని తెలుపుతున్నారు. కష్టం ఫలిస్తుందని, ఆరోగ్యం బాగుంటుందని, ఆప్తులతో ఉల్లాసంగా గడపుతారని, ఖర్చులు అధికంగా ఉంటాయని తెలుపుతున్నారు.
అనుగ్రహం
28 సెప్టెంబర్ - 4 అక్టోబర్ 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
అప్రమత్తంగా ఉండాలి. భేషజాలకు పోవద్దు. ఆప్తులకు మీ సమస్య తెలియజేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. చేబదుళ్లు స్వీకరిస్తారు. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. మనోధైర్యంతో కొత్తయత్నాలు మొదలెట్టండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నం ఫలించే అవకాశం ఉంది. అవతలి వారి స్తోమత క్షుణ్ణంగా తెలుసుకోండి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
శుభవార్త వింటారు. కొన్ని సంఘటనలు అనుకున్నట్టే జరుగుతాయి. కష్టం ఫలిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆపన్నులకు సాయం చేస్తారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. చీటికిమాటికి చికాకుపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరు తుంది. రావలసిన ధనం అందుకుంటారు. ప్రణాళికలు వేసుకుంటారు. అవకాశాలు కలిసి వస్తాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. కావల సిన వస్తువులు సమయానికి కనిపించవు. సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్నీ తేలి కగా తీసుకోవద్దు. ఎదుటివారి అభిప్రాయాలు తెలుసుకోండి. సేవా సంస్థలకు విరాళాలంది స్తారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూ లిస్తాయి. ఖర్చులు విపరీతం. విలాస వస్తు వులు కొనుగోలు చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
పరిస్థితులు క్రమంగా మెరుగు పడతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. రావలసిన ధనం అందుతుంది. రుణ విముక్తులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగు తుంది. ఆహ్వానం అందుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. పత్రాలు జాగ్రత్త.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
సంకల్పబలంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయం కృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. స్నేహసం బంధాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టిం చుకుంటారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. ప్రముఖులతో పరిచయా లు ఏర్పడతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. మీ శక్తిసామర్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం, కష్టసమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సామ రస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
గ్రహానుకూలత ఉంది. కుటుం బసౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆహ్వా నం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్తపనులు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవు తాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
ఆర్థిక లాభాలున్నాయి. రావలసిన ధనం అందుతుంది. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. వేడుకను ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఏ పనీ చేయ బుద్థికాదు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పిల్లల అత్యుత్సాహం వివాదాస్పదమవుతుంది.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. రాబోయే ఆదా యానికి తగ్గట్టు ఖర్చులు సిద్థంగా ఉంటాయి. మీ అభిప్రాయాలను సౌమ్యంగా తెలియ జేయండి. మీ చొరవతో ఒక సమస్య సద్దుమ ణుగుతుంది. పనులు పురమాయించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరు తుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆదాయం సంతృప్తికరం. రుణసమస్యలు తొలగుతాయి. బంధుమిత్రులతో తరచూ సంభాషిస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అపరిచితులతో మితంగా సంభాషించండి. కీలక విషయాలు వెల్లడించవద్దు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సమయస్ఫూర్తితో మెలగండి.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆచితూచి అడుగేయండి. ఆగ్రహావేశాలకు లోనుకావద్దు. మీ తప్పిదాలు సరిదిద్దుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అదు పులో ఉండవు. అవసరాలకు ధనం అందు తుంది. కొందరి రాక అసహనం కలిగిస్తుంది. చేస్తున్న పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ఎదుటివారు మీ అశక్తతను అర్థం చేసుకుం టారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
Updated Date - Sep 28 , 2025 | 07:30 AM