Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి
ABN, Publish Date - Dec 03 , 2025 | 03:04 AM
నేడు రాశిఫలాలు 3-12-2025 - బుధవారం , ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి...
నేడు రాశిఫలాలు 3-12-2025 - బుధవారం , ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి...
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలం. మధ్యాహ్నం తరువాత విలువైన పత్రాలు, పారితోషికాల విషయంలో నిరుత్సాహం తప్పకపోవచ్చు. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బోనస్‌లు, అదనపు ఆదాయం కోసం ప్రయత్నించి విజయం సాధిస్తారు. మధ్యాహ్నం నుంచి బీమా, మెడికల్ క్లెయిములు, పెన్షన్ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గణపతిని ఆరాధించండి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న ప్రియతముల నుంచి సంతోషం కలిగించే సమాచారం అందుకుంటారు. మధ్యాహ్నం నుంచి మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. బందుమిత్రులతో విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. సహకార సంఘాలు, వృత్తిపర మైన సమావేశాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ రామచంద్ర మూర్తిని దర్శించండి.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మధ్యాహ్నం నుంచి కన్సల్టెన్సీలు, క్రీడలు, టెలివిజన్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికం. గణపతిని ఆరాధించండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
న్యాయ, బోధన, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బందుమిత్రుతో ఆనందంగా గడుపుతారు. ఇల్లు, స్థలసేకరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మధ్యాహ్నం నుంచి దూరంలో ఉన్న ప్రియతములకు సంబంధించిన సమాచారం ఆవేదన కలిగిస్తుంది. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులకు సంబంధించిన విలువైన పత్రాలు అందుకుంటారు. బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకుని ముందడుగు వేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మధ్యాహ్నం నుంచి సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాలి. గణపతి ఆలయాన్ని దర్శించండి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తపరిచయాల వల్ల ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మధ్యాహ్నం నుంచి ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. మధ్యాహ్నం నుంచి సన్నిహితుల వైఖరిర మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. గణపతి స్తోత్ర పారాయణ చేయండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, వీసా వ్యవహారాలకు అనుకూలమైన రోజు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. మధ్యాహ్నం నుంచి చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలగిస్తుంది. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.
కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఇల్లు కొనుగోలు, స్థల సేకరణకు కావలసిన నిఽధులు చేతికి అందుతాయి. గృహరుణాలు మంజూరవుతాయి. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లోపించడంతో ఇబ్బంది పడతారు. గణపతిని ఆరాధించండి.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఇంటర్య్వూలలో ఆఽశించిన ఫలితాలు సాధిస్తారు. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మధ్యాహ్నం నుంచి ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఒక సమాచారం ఇబ్బంది కలిగిస్తుంది. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.
Updated Date - Dec 03 , 2025 | 03:04 AM