ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dussehra Festival 2025: దసరా రోజు పాలపిట్టను చూస్తే ఏమౌతుంది?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ABN, Publish Date - Sep 30 , 2025 | 04:03 PM

దసరా పర్వదినం రోజు పాలపిట్టను చూస్తే.. మంచి జరుగుతుందని అమ్మవారి భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. పురాణాల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ పాలపిట్టనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికార పక్షిగా నిర్ణయించింది. ఈ పక్షిని.. నీలకంఠం పక్షి అని కూడా అంటారు.

Dussehra Festival 2025

దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది గురువారం నాడు విజయదశమి వచ్చింది. ఇక, దసరా పండుగ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. అంతేకాదు.. ఎంతో ప్రాముఖ్యత కలిగిన జమ్మి చెట్టుకు సైతం పూజలు చేస్తారు. జమ్మి చెట్టుకు పూజలు చేసిన తర్వాత పాల పిట్టను చూస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. హిందూ పురాణాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. పాల పిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్దికి సంకేతంగా హిందువులు భావిస్తారు. ఈ పక్షిని పరమేశ్వరుడి ప్రతి రూపంగా అనుకుంటారు. అందుకే ద‌స‌రా పండుగ రోజు పాల పిట్టను చూస్తే అన్నీ శుభాలే జ‌రుగుతాయ‌ని భక్తులు గాఢంగా నమ్ముతారు.

పాల పిట్టకు.. దసరాకు సంబంధం ఏంటి?..

హిందూ పురాణాల ప్రకారం.. త్రేతాయుగంలో విజ‌య ద‌శ‌మి రోజున రావ‌ణాసురుడితో యుద్ధానికి బ‌య‌లుదేరిన‌ సమయంలో శ్రీరాముడికి పాలపిట్ట క‌నిపించింది. ఆ యుద్ధంలో రాముడు విజ‌యం సాధించాడు. దీంతో పాలపిట్టను శభ సూచికంగా శ్రీరాముడు భావించారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.

జమ్మి చెట్టుపై పాండవుల ఆయుధాలు..

ద్వాపర యుగంలో పాండవులు అరణ్య వాసానికి వెళ్లేటప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై పెట్టారు. అప్పుడు ఇంద్రుడు పిట్టలాగా మారి వాటికి కాపలాగా ఉన్నాడు. అరణ్య వాసం ముగిసిన తర్వాత పాండవులు తిరిగి వెళ్లేటప్పుడు జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను తిరిగి తీసుకున్నారు. అక్కడినుంచి వెళుతున్నపుడు వారికి పాలపిట్ట ఎదురుపడింది. ఆ తర్వాత కౌరవులతో జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు.

తమ రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నారు. అందుకే దసరా పర్వదినం రోజు పాలపిట్టను చూస్తే.. మంచి జరుగుతుందని అమ్మవారి భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. పురాణాల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ పాలపిట్టనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికార పక్షిగా నిర్ణయించింది. ఈ పక్షిని.. నీలకంఠం పక్షి అని కూడా అంటారు.

ఇవి కూడా చదవండి

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

Updated Date - Sep 30 , 2025 | 04:18 PM