Heavy Rain Lashes Hyderabad: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
ABN , Publish Date - Sep 30 , 2025 | 02:58 PM
రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు బాగా ఎండ కాసింది. 2.40 నిమిషాల సమయంలో ఉన్నట్టుండి భారీ వర్షం మొదలైంది. అరగంట పాటు వర్షం దంచికొట్టింది. ఉన్నట్టుండి వర్షం పడ్డంతో జనాలు తీవ్ర ఇబ్బందుపడాల్సి వచ్చింది. మరో నాలుగు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక, అల్లూరి, పార్వతీపురం, కాకినాడ, యానాం, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలలో రానున్న 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లకు కీలక సూచనలు చేసింది.
ఇవి కూడా చదవండి
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఈ ఆలోచనలను పొరపాటున కూడా ఎవరితోనూ పంచుకోకండి..