ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారు పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు

ABN, Publish Date - Oct 31 , 2025 | 12:53 AM

నేడు రాశిఫలాలు 31-10-2025 శుక్రవారం, పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు...

నేడు రాశిఫలాలు 31-10-2025 శుక్రవారం, పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. పది మందిలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. వేడుకలు, సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. దుర్గామాతను దర్శించండి.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, టీచింగ్‌, ప్రచురణ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. సహోద్యోగులతో చర్చలు, ప్రయాణాలు అనందం కలిగిస్తాయి. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

బోనస్‌లు అందుకుంటారు. బీమా, పెన్షన్‌ గ్రాట్యుటీ పనులు పూర్తవుతాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అడ్వాన్సులు అందుకుంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు లభిస్తాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

వివాహ నిర్ణయాలకు అనుకూలం. వేడుకలు, బృంద కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. నూతన భాగస్వామ్యాల వల్ల ప్రయోజనం పొందుతారు. బంధుమిత్రుల వైఖరిని సమీక్షించుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సహోద్యోగులతో చర్చలు, ప్రయాణాలు అనందం కలిగిస్తాయి. వైద్యం, హోటల్‌, ఫార్మా, కేటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. శుభవార్త అందుకుంటారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సృజనాత్మకరంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, మార్పుల విషయంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. లలితాదేవిని ఆరాధించండి.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

బోధన, రవాణా, కమ్యూనికేషన్లు, స్టేషనరీ, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లపై ఒక అవగాహనకు వస్తారు. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు అనుసరించి విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూల సమయం. ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మన్ననలు అందుకుంటారు. లక్ష్యాలు సాధిస్తారు. దుర్గాదేవిని ఆరాధించండి.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహరాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. శుభవార్త అందుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూలమైన రోజు. గతాన్ని సమీక్షించుకుని మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. కనకధారా స్తోత పారాయణ శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 31 , 2025 | 12:53 AM