ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారు రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ రంగాలల్లో ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి

ABN, Publish Date - Dec 08 , 2025 | 12:15 AM

నేడు రాశిఫలాలు 8-12-2025 - సోమవారం , చిన్నారుల విద్యా విషయాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది...

నేడు రాశిఫలాలు 8-12-2025 - సోమవారం , చిన్నారుల విద్యా విషయాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల విద్యా విషయాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు అనందం కలిగిస్తాయి. ప్రకటనలు, టెలివిజన్‌, ఆడిటింగ్‌, ఫైనాన్స్‌ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పరమశివు,ని ఆరాధించండి.

వృషభం ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. గతించిన బంధుమిత్రులను స్మరించుకుంటారు. ఇంటి కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. అందుకోసం అవసరానికి మించి వెచ్చిస్తారు. ఆర్థిక విషయాల్లో కటుం సభ్యులు వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. శ్రీ రుద్ర కవచ పారాయాణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

కొత్త పరిచయాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమానుబంధాలు బలపడతాయి. తోబుట్టువులతో కుటుంబ సభ్యుల వివాహ విషయాలు చర్చకు వస్తాయి. ప్రిమతములతో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. భాగస్వామికి సంబంధించి ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. పరమశివుని ఆరాధన శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు ఆర్థిక లక్ష్యాల సాధనకు అధికంగా శ్రమించాలి. ఆరోగ్యం కోసం ఖర్చులు అధికం. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలపై ఆశించిన ప్రతిఫలాలు అందకపోవచ్చు. విద్యా సంస్థలు, సినిమాలు, టెలివిజన్‌, క్రీడల రంగాల వారు కొత్త ప్రయోగాలు చేసేందుకు తగిన సమయం కాదు. పరమశివుని ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెట్టుబడులపై ఒక నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. పరమేశ్వరుని ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు లాభించకపోవచ్చు. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. విద్యా సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సమావేశాలు, చర్చలు లాభిస్తాయి. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికపరమైన లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. పరమేశ్వరుని ఆరాధన శుభప్రదం.

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, దూరప్రయాణాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కొత్త వ్యూహాల అమలును వాయిదా వేయడం మంచిది. న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ రుద్ర కవచ పారాయాణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం మందగించే ప్రమాదం ఉంది. ఆర్థిక వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. పెట్టుబడులు, పొదుపు పథకాల విషయంలో అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవడం మంచిది. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యహరించాలి. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. బందుమిత్రులతో ఆర్థిక విషయాలు చర్చకు వస్తాయి. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాలకు ఖర్చు చేస్తారు. రుద్ర నమక, చమకాలను వినడం శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Dec 08 , 2025 | 12:16 AM