ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విశ్వశాంతి మహాశక్తి గణపతి

ABN, Publish Date - Aug 24 , 2025 | 09:42 AM

ఏటా ఒక్కో విశిష్ట రూపం... 11 రోజుల్లో 25 లక్షల మంది భక్తుల సందర్శనం... 71 సంవత్సరాలుగా కొనసాగుతున్న మహోత్సవం... భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఖైరతాబాద్‌ గణేశుని ప్రత్యేకతలు అనేకం. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా దర్శనమిస్తున్న ఆ స్వామి విశేషాల మాలిక...

ఏటా ఒక్కో విశిష్ట రూపం... 11 రోజుల్లో 25 లక్షల మంది భక్తుల సందర్శనం... 71 సంవత్సరాలుగా కొనసాగుతున్న మహోత్సవం... భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఖైరతాబాద్‌ గణేశుని ప్రత్యేకతలు అనేకం. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా దర్శనమిస్తున్న ఆ స్వామి విశేషాల మాలిక...

గ్రహగతుల ఆధారంగా ఏ రూపంలో ఉన్న గణపతిని పూజిస్తే క్షేమదాయకం అనే విషయాన్ని సమీక్షించి, వేద పండితుల సూచనల మేరకు గణపతితో పాటు ఆయనతో కలిపి పూజించే దేవతా మూర్తులను ఏర్పాటుచేయడం భాగ్యనగరంలోని ఖైరతాబాద్‌ గణపతి ఉత్సవాల ప్రత్యేకత. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాతావరణ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను క్షేమంగా బయట పడేసే లక్ష్యంతో దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠలశర్మ సూచనల మేరకు ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ గణేశుడు శ్రీవిశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నారు.

71వ సంవత్సర వేడుకలు...

స్వాతంత్య్ర సమరం జరుగుతున్న రోజుల్లో ఆంగ్లేయులకు వ్యతిరే కంగా ప్రజలందరినీ సమైక్యంగా ఉంచాలనే సంకల్పంతో బాలగంగా ధర తిలక్‌ ఇచ్చిన పిలుపు మేరకు వినాయక ఉత్సవాలు దేశంలో మొదట నాలుగు చోట్ల ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఈ ఉత్సవాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించారు. ఈ క్రమంలో ఖైరతాబాద్‌లో 1954లో స్వాతంత్య్ర సమరయోధుడు సింగరి శంకరయ్య ఇక్కడ ఒక అడుగు గణపతి విగ్రహంతో ఉత్సవా లను ప్రారంభించారు. కొద్ది సంవత్సరాలకు శంకరయ్య ఖైరతాబాద్‌ కౌన్సిలర్‌గా ఎన్నికవడంతో అజంతా

గుహల్లోని ఒక గుహ నమూ నాతో గణపతి ఉత్సవాలు జరుపుకునేందుకు వీలుగా చిన్న దేవా లయం, గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. ఆ భవనంలో గణపతిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా తామరపువ్వు ఆకారంలో నమూ నాను తయారు చేశారు. దీన్ని నేటికీ మనం చూడవచ్చు. ఈ నమూ నాలో గణపతి 10 అడుగుల వరకే ప్రతిష్ఠించే అవకాశం ఉండడం, స్థల మహాత్మ్యం, కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఖ్యాతి పొందడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భక్తుల కోరిక మేరకు గణపతి ఎత్తును ఏటా పెంచుతూ, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అలా ఈ ఉత్సవాలు ఈ ఏడాది 71వ సంవత్సరానికి చేరుకున్నాయి.

త్రిశక్తి సమేత గణనాథుడు

ఖైరతాబాద్‌ గణేశుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకుదర్శనమిస్తున్నాడు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడ ల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తి సమే తుడిగా ముస్తాబయ్యాడు. భూమిపైకి గణనాథుడు వచ్చినట్లు చూపే విధంగా భూగోళం, దాని పైన మూడు తలలతో త్రిశక్తి సమేతుడిగా, ఐదు తలల నాగసర్పం కింద గణనాఽథుడు ఉండేలా ఆ దివ్యమూర్తిని రూపొందించారు. 8 బాహువులతో ఉన్న గణపతికి కుడి వైపున చేతుల్లో అంకుశం, చక్రం, రుద్రాక్షలతో పాటు ఆశీర్వాదం ఇస్తు న్నట్లుగా రూపొందించారు.

అలాగే ఎడమ వైపున చేతుల్లో పాశం, కమలం, గ్రంథంతో పాటు లడ్డుతో స్వామి దర్శనం ఇస్తున్నారు. వినాయకుడితో పాటు ఆయన పక్కన పూరీ జగన్నాథుడు సుభద్ర, బలరాముల సమేతంగా సుందరమూర్తులను 8 అడుగుల ఎత్తుతో రూపొందించారు. మరోవైపు 12 అడుగుల ఎత్తుతో లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని అందంగా ముస్తాబు చేశారు. ఎప్పటి మాదిరి గానే గణపతికి ఇరువైపులా ఏర్పాటు చేసే విగ్రహాల్లో కుడివైపున ఆర్యవైశ్యుల కుల దేవత కన్యకా పరమేశ్వరి అమ్మవారిని 15 అడుగుల ఎత్తుతో 102 గోత్రాల చెట్టుతో కలసి అందంగా ముస్తాబు చేశారు. ఎడమ వైపున ఖైరతాబాద్‌ గ్రామ దేవతగా పిలుచుకునే గజ్జెలమ్మ అమ్మవారిని 15 అడుగుల ఎత్తుతో తయారు చేశారు.

ఖైరతాబాద్‌ గణనాథుడిని ప్రముఖ శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ తయారు చేస్తారు. ఆయన అద్భుత శిల్పకళా నైపుణ్యంతో గణపతిని ఎక్కడినుంచి చూసినా తమనే చూస్తున్న అనుభూతిని భక్తులు పొందుతుంటారు. ప్రధాన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 130 మంది నిపుణులైన కళాకారులు, కార్మికులు ఈ విగ్రహ తయారీలో పాల్గొన్నారు. నిర్జల ఏకాదశి రోజైన జూన్‌ 6న ప్రారంభమైన గణపతి నిర్మాణ పనులు వినాయక చవితి నాటికి పూర్తవుతాయి. ఆదిలాబాద్‌ నుంచి వచ్చిన నిపుణులైన కార్మికులు షెడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. మచిలీపట్నంకు చెందిన నిపుణులు వెల్డింగ్‌ పనులను చేశారు.

ఒరిస్సా కళాకారులు మట్టితో గణపతిని ముస్తాబు చేయగా, చెన్నైకి చెందిన కళాకారుల బృందం ఫినిషింగ్‌ పనులు చేశారు. కాకినాడకు చెందిన ఆర్టిస్టులు గణనాథుడికి రంగులద్ది అలంకరిం చారు. దేశ వ్యాప్తంగా ఎన్నో కళాఖండాలు తయారు చేసిన రాజేంద్రన్‌ అతడి బృందంతో కలసి దాదాపు 84 రోజులపాటు శ్రమించి వినాయ కుడిని ముస్తాబు చేశారు. గుజరాత్‌ నుంచి తెచ్చిన బంకమట్టిని స్వామి విగ్రహం తయారీకి ఉపయోగించారు. మట్టితో చేసిన గణ పతిని క్రేన్‌ సహాయంతో లేపి ట్రాలీపై ఉంచి దాదాపు 3 కిలోమీటర్ల మేరకు భారీ ఊరేగింపు నిర్వహించి అదే క్రేన్‌ ద్వారా హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయడం సంప్రదాయంగా వస్తున్నది.

అప్పటి వరకు విగ్రహానికి ఎలాంటి పగుళ్లు రాకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు శిల్పి రాజేంద్రన్‌. స్టీలు వెల్డింగ్‌ అనంతరం చికెన్‌ మెష్‌ను చుట్టి దానిపై నుండి గోనెబట్ట, బంకమట్టితో ఆకారాన్ని చేస్తారు. అనంతరం వరిగడ్డి, మట్టిని కలిపి పెట్టి, దానిపై నుండి సుతిలీ తాడుతో చుడతారు. తర్వాత మట్టి, ఇసుక, వరిపొట్టు, సుతిలీ పౌండర్‌ను కలిపి పగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అనంతరం సన్నని కోరా వస్త్రం పెట్టి దానిపై నుంచి ఫిల్టర్‌ చేసిన మట్టి పౌడర్‌తో ఫినిషింగ్‌ చేస్తారు.

ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకునే వారి సంఖ్య ఏటా పెరుగు తోంది. కోరిన కోర్కెలు తీరడంతో భక్తులు మొక్కులు తీర్చుకుంటూ కానుకలు సమర్పిస్తుంటారు. వినాయక ఉత్సవాల్లో కేవలం 11రోజుల్లో 25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లుచేస్తారు. 11 రోజుల పాటు ముఖ్యంగా ఆదివారాలు, సెలవు రోజులు, చివరి 3 రోజుల్లో దాదాపు 3 నుండి 5 లక్షల మంది ఖైరతాబాద్‌ గణేశుడిని దర్శించుకుంటారని అంచనా. వందలాది మంది చిరువ్యాపారులు ఖైరతాబాద్‌ గణపతి ఉత్సవాల్లో తమ వస్తువులను విక్రయిస్తూ దాదాపు రూ.10 కోట్లకు పైగా వ్యాపారం చేస్తుంటారు. ఖైరతాబాద్‌ భారీ గణపతికి కనీసం వంద అడుగుల పూలమాల అవసరమవు తుంది. ఒక కండువా వేయాలంటే 2 డబుల్‌ ధోవతులను కలిపి కుట్టించాలి. ప్రతిరోజూ మహాగణపతి ఎదుట లోక కళ్యాణార్థం హోమం నిర్వహిస్తారు.

- ఎనగంటి లక్ష్మణ్‌ యాదవ్‌

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఖైరతాబాద్‌

ఫొటోలు: హరిప్రేమ్‌

ఖర్చు... కోటి పైమాటే

ఖైరతాబాద్‌ గణపతిని లక్షలాది మంది భక్తుల మనోభావా లకు అనుగుణంగా అద్భుతంగా ఖర్చుకు వెనకాడకుండా తయారు చేస్తారు. ఇక్కడి విగ్రహాల తయారీ కోసం 30 టన్నుల స్టీలు, 4 మీటర్ల పొడవున్న చికెన్‌ మెష్‌ 40 బండిళ్లు, 30 కిలోల బరువుండే 1000 బ్యాగుల మట్టి, 20 మీటర్ల పొడవున్న గోనెబట్ట 20 తాన్లు, 50 కిలోల సుతిలీ పౌడర్‌, 25 కిలోల బరువుండే 70 బ్యాగుల వరిపొట్టు, 15 మీటర్ల పొడవుండే 22 బండిళ్ల కోరా వస్త్రం, సగం లారీ ఇసుక, 20 కిలోల బరువుండే 50 బండిళ్ల వరిగడ్డితో పాటు ఇతర వస్తువులను వినియోగించారు. ఇక్కడి షెడ్డు నిర్మాణంతో పాటు అలంకరణ, దేవతా విగ్రహాల తయారీ, భక్తులకు ఏర్పాట్లు కలసి మొత్తంగా దాదాపు కోటి రూపాయ లకు పైనే ఖర్చు అవుతుందని అంచనా.

Updated Date - Aug 24 , 2025 | 09:42 AM