ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు

ABN, Publish Date - Aug 24 , 2025 | 07:00 AM

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుందని, అయితే.. అపరిచితులను ఓ కంట కనిపెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే శుభకార్యానికి హాజరవుతారని, స్నేహసంబంధాలు బలపడతాయని, ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదని సూచిస్తున్నారు.

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుందని, అయితే.. అపరిచితులను ఓ కంట కనిపెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే శుభకార్యానికి హాజరవుతారని, స్నేహసంబంధాలు బలపడతాయని, ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదని సూచిస్తున్నారు.

అనుగ్రహం

24 - 30 ఆగస్టు 2025

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు..

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

ఆశావహదృక్పధంతో శ్రమిం చండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకో వద్దు. యత్నాలకు పరిస్థితులు అనుకూలి స్తాయి. స్వయంకృషితోనే లక్షం సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. దైవకార్యానికి వ్యయం చేస్తారు. సన్నిహితుల ఆహ్వానం అందుకుంటారు. పనులు త్వరితగతిన సాగు తాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో మార్పులు సాధ్యమవుతాయి.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

లావాదేవీలు కొలిక్కివస్తాయి. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. స్నేహసంబంధాలు వెల్లివిరుస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. అవతలివారి స్తోమతను తెలుసుకోండి. తొందరపడి మాటఇవ్వవద్దు. పెద్దలను సంప్రదించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

అన్నివిధాలా అనుకూలం. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుం టారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పొగిడే వారి ఆంతర్యం గ్రహించండి. కొందరి రాక ఇబ్బంది కలిగి స్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. మీ మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. . న్యాయనిపుణులను సంప్రదిస్తారు.

కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

కార్యసాధనకు మరింత శ్రమించాలి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించు కోవద్దు. సంకల్పబలమే విజయానికి దోహద పడుతుంది. ఆత్మీయులతో తరచు సంభాషి స్తుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్త వుతాయి. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి.

సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కష్టం ఫలిస్తుంది. రావలసిన ధనం అం దుతుంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. అవ కాశాలను తక్షణం సద్వినియోగం చేసుకోండి. అనుమానాలకు తావ్వివద్దు. అందరితోను మితంగా సంభాషించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సన్నిహితులకు మీ సమస్యను తెలియజేయండి.

కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విష యానికే చికాకుపడతారు. మీ తప్పులు సరి దిద్దుకోవటం ఉత్తమం. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించు కుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు, పనులు వాయిదా పడతాయి. పెద్దల జోక్యంతో సమస్య పరిష్కారమవు తుంది. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు.

తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

శుభవార్త వింటారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవు తుంది. మానసికంగా కుదుటపడతారు. ఉల్లా సంగా గడుపుతారు. స్థిరాస్తి ధనం అందు తుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రముఖులకు సన్నిహి తులవుతారు. ఆశించిన పదవులు దక్కవు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

మీదైన రంగంలో రాణిస్తారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. సము చిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుం టారు. ప్రైవేట్‌ సంస్థల్లో మదుపు తగదు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడతాయి. అనుకున్న కార్యం నెర వేరుతుంది. మరింత ఉత్సాహంగా కొత్త పనులు చేపడతారు. యత్నాలకు పెద్దల ఆశీస్సులుంటాయి. అవగాహన లేని విష యాల్లో జోక్యం తగదు. అందరితోనుమితంగా సంభాషించండి. పత్రాల్లో సవరణలు సాద్య పడవు. పట్టుదలతో మరోసారి ప్రయత్నిం చండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు అధికం. బాధ్యతలు అప్పగించవద్దు.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. సన్నిహితు లతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వివాహయత్నం ఫలించే సూచన లున్నాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. భేషజాలకు పోవద్దు. పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కార్యసిద్థి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది. ఇతరులకు బాధ్యతలు అప్పగిం చవద్దు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.

మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మనోధైర్యంతో ముం దుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులు విపరీతం. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాల క్షేపం చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.

Updated Date - Aug 24 , 2025 | 07:00 AM