Weekly Horoscope: ఆ రాశి వారికి ఈవారం అంతా లాభదాయకమే
ABN, Publish Date - Jul 20 , 2025 | 05:51 AM
ఆ రాశి వారికి ఈవారం అంతా లాభదాయకమేనని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయని, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారని, ఆదాయానికి మించి ఖర్చులుంటాయని, పొదుపు ధనం అందుకుంటారని తెలుపుతున్నారు. ఇంకా... ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఎన్నాయో ఓసారి పరిశీలిస్తే...
అనుగ్రహం
20 - 26 జూలై 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. త్వరలో అనుకూల తలు నెలకొంటాయి. రాబడిపై దృష్టి పెడ తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరు తాయి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. అందరితోనూ మితంగా సంభాషించండి. పిల్లల విద్యా యత్నం ఫలిస్తుంది. సన్నిహితులతో సంభాషి స్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. అవకాశాలు వదులుకోవద్దు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఓర్పుతో మెలగండి. ఖర్చులు విపరీతం. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. పత్రాల రెన్యు వల్‌లో జాప్యం తగదు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ అభిప్రాయా లను స్పష్టంగా తెలియజేయండి. చుట్టుపక్కల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం,
పుష్యమి, ఆశ్లేష
గృహస్థితి నిరాశాజనకం. సమయానుకూలంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్ద్దు. ఒత్తిడి పెరగ కుండా చూసుకోండి. దృఢసంకల్పంతో శ్రమిస్తే గాని పనులు కావు. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్ని హితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అంది పుచ్చుకోండి.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. తొందరపాటు నిర్ణయం తగదు. పెద్దలను సంప్రదించండి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. చేపట్టిన కార్యం త్వరలో పూర్తవుతుంది. ఆశా వహదృక్పఽథంతో అడుగు ముందుకేయండి. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. ఆటంకాలు ఎదురైనా ఆందోళన చెందవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వొద్దు.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
ప్రణాళికాబద్థంగా యత్నాలు సాగించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆపన్నులకు సాయంఅందిస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. మీ అభిప్రా యాలకు స్పందన లభిస్తుంది. కీలకపత్రాలు అందుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం;
అనూరాధ, జ్యేష్ఠ
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆదాయం సంతృప్తికరం. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. అపరిచితులతో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఇతరులను మీ దరికి చేరనీయవద్దు. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత ముఖ్యం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
కొంతమేరకు అనుకూలమే. కొన్ని సమస్యలు తొలగుతాయి. సమయ స్ఫూర్తితో మెలగుతారు. పనులు సావకాశమ వుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆత్మీయుల సాయం అందుతుంది. ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
మీ విజ్ఞతకు పరీక్షాసమయం. వ్యవహారంలో తొందరపాటు తగదు. ఆచి తూచి అడుగేయాల్సిన సమయం. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సాయం ఆశించి భంగపడతారు. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. మనోధైర్యంతో మెలగండి. నోటీసులు అందుకుంటారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం,
పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
విశేషమైన కార్యసిద్ధి ఉంది. పట్టుదలతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. విందుకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపునలో ఉంచుకోండి.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం,
ఉత్తరాభాద్ర, రేవతి
మనోభీష్టం నెరవేరుతుంది. ప్రతికూలతలు తొలగుతాయి. ఉత్సాహంగా శ్రమించండి. పనులు మధ్యలో ఆపివేయవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులు అధికం. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ముఖ్య మైన వ్యవహారాల్ల్లో అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. పిల్లలకు శుభపరిణామాలున్నాయి.
Updated Date - Jul 20 , 2025 | 05:51 AM